మల్లారెడ్డి కళాశాలపై కేసు నమోదు | Case Filed Against Malla Reddy College | Sakshi
Sakshi News home page

మల్లారెడ్డి కళాశాలపై కేసు నమోదు

Aug 24 2026 7:34 AM | Updated on Aug 24 2026 7:40 AM

Case Filed Against Malla Reddy College

హైదరాబాద్‌: టాక్సిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి కాలు విరగగా, మరో నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యంతో పాటు నిర్వాహకులు, చిత్ర యూనిట్‌పై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ విజయవర్ధన్‌ కథనం ప్రకారం... మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్‌ ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం రాత్రి నిర్వహించగా సినీ హీరో యష్‌ , హీరోయిన్లతో పాటు వేలాదిమంది విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ల కోసం ఏర్పాటు చేసిన ఫ్లడ్‌ లైట్‌ పోల్‌పై విద్యార్థులతో పాటు పలువురు యువకులు ఎక్కడంతో అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది. 

దీంతో వనపర్తికి చెందిన బీటెక్‌ మూడవ సంవత్సరం విద్యార్థి భాను ప్రకాష్‌ (22) కాలు విరగగా, వరంగల్‌ జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్, ఆటో డ్రైవర్లు సన్నీ, మార్క్, దీపక్‌ లకు స్వల్ప గాయాలు కాగా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించినట్లు మల్లారెడ్డి ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంతో పాటు ఫ్రీ రిలీజ్‌ చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement