మహేంద్రగిరి వారాహి పెద్ద హిట్‌ కాబోతోంది  | Akhil Akkineni Speech at Mahendragiri Varahi Pre Release Event | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరి వారాహి పెద్ద హిట్‌ కాబోతోంది 

Sep 7 2026 4:49 AM | Updated on Sep 7 2026 4:49 AM

Akhil Akkineni Speech at Mahendragiri Varahi Pre Release Event

– అక్కినేని అఖిల్‌

‘‘చిన్నప్పట్నుంచి నేను అమ్మ, నాన్నలతో కొన్ని విషయాలను చెప్పలేకపోయేవాణ్ణి. అలాంటప్పుడు ప్రతి ఫోన్‌కాల్‌ సుమంత్‌ అన్నకే వెళ్లేది. ఒక్కసారి కూడా ఆయన కాదనలేదు. ఈ రోజు నేను ఆయన సినిమా ఫంక్షన్‌కు వచ్చి, మాట్లాడటం హ్యాపీగా ఉంది. సుమంత్‌గారు నాకు స్పెషల్‌ బ్రదర్‌’’ అని అక్కినేని అఖిల్‌ అన్నారు. 

సుమంత్‌ హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేసిన అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘సిద్ధుగారు హీరోగా సినిమాలు చేస్తూనే, కంటెంట్‌ ఉన్న ఈ తరహా సినిమాలో కూడా భాగమైనందుకు అభినందిస్తున్నాను. 

ఈ సినిమా కోసం దర్శకుడు సంతోష్‌ ప్రాణం పెట్టారు. ‘మహేంద్రగిరి వారాహి’ చాలా పెద్ద హిట్‌ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌కు నన్ను పిలవాలని అడుగుతున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన లక్ష్మణ్, మధుగార్లకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. 

సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం దాదాపు 150 థియేటర్స్‌లో వారాహి విగ్రహాలను పెట్టడం జరిగింది. గతంలో ‘అమ్మోరు’ సినిమాకు ఇలా చేశారట. ఈ సినిమా విషయంలో ఎప్పట్నుంచో ఒక డివోషనల్‌ వైబ్‌ను ఫీలవుతున్నాను. ఏదో శక్తి మా వెనకాల ఉందనిపిస్తోంది. సెప్టెంబరు 11న మా కష్టార్జితాన్ని థియేటర్స్‌లో మీరు చూడబోతున్నారు. ఇక ‘లెనిన్‌’తో తన సత్తా ఏంటో అఖిల్‌ నిరూపించాడు’’ అని తెలిపారు.

 సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నేను యాక్టర్‌గా స్ట్రగుల్‌ అయినప్పట్నుంచి నిర్మాత మధుగారు నాకు తెలుసు. మధుగారి వల్ల ఈ మూవీలో భాగమయ్యాను’’ అని అన్నారు. 

సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మిన సుమంత్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలోని రాజేంద్రవర్మ పాత్ర కోసం సిద్ధుగారిని అ్రపోచ్‌ అయినప్పుడు, ఆయన కథ నచ్చి, చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు ఒక మంచి హిట్‌ ఇచ్చి, వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. 

మధు కాలిపు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం సుమంత్‌గారితో రెండున్నరేళ్లుగా జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన సిద్ధుకు రుణపడి ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో ఓ డిఫరెంట్‌ రోల్‌ చేశాను’’ అన్నారు బ్రహ్మానందం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement