తెలుగు సినిమాల్లో హీరోగానే కెరీర్ మొదలుపెట్టి మధ్యలో సహాయ పాత్రలు చేసి ప్రస్తుతం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్న అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్ అలియాస్ త్రిగుణ్.. బిగ్‌బాస్ 10లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు.
తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.
ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్‌గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్‌బాస్‌లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్‌ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.


