సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ | Brahmanandam Hilarious Comments on Siddu at Mahendra Giri Varahi Pre Release Event | Sakshi
Sakshi News home page

సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ

Sep 7 2026 4:05 PM | Updated on Sep 7 2026 4:19 PM

Brahmanandam Hilarious Comments on Siddu at Mahendra Giri Varahi Pre Release Event

సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్‌ వచ్చారు. ఈ వేడుకలో నటుడు బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?
ఓ సందేహం వస్తుందని..
సినిమా గురించి మాట్లాడిన బ్రహ్మానందం.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో సిద్ధు జొన్నలగడ్డను ప్రశంసించారు. సిద్ధును చూస్తున్నప్పుడు తనకు ఓ సందేహం వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘అతను అందంగా ఉంటాడా.. లేక నేనా?’ అని అనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో ‘నాకు నేనే సంతృప్తి పరుచుకుంటా’ అంటూ చమత్కరించారు.

అనంతరం ఇదే విషయంపై యాంకర్‌ సుమను బ్రహ్మానందం సరదాగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన సుమ.. ‘మీ గ్లామర్‌ ముందు నేనేం మాట్లాడగలను’ అంటూ నవ్వులు పూయించారు. ఆ వెంటనే ‘వారేవా ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అంటూ పాట పాడారు. దీంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై కాసేపు నవ్వుల సందడి నెలకొంది.  
  ( తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్‌’.. కలెక్షన్లు ఎంతంటే.? )
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement