ఉద్యోగుల భవిష్యత్తు.. RGV హెచ్చరిక! | RGV Comments on AI and the Future of Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల భవిష్యత్తు.. RGV హెచ్చరిక!

Sep 7 2026 6:49 PM | Updated on Sep 7 2026 7:05 PM

RGV Comments on AI and the Future of Jobs

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు, మానవ ఆలోచనా సామర్థ్యం ఎలా మారవచ్చనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ అనేది మొదటి నుంచి మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది. శారీరక శ్రమను తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, రోజువారీ విసుగు పుట్టించే పనులను మనకు దూరం చేయడం టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏఐ కూడా అదే పని చేస్తోంది.

అయితే.. ఈసారి ఏఐ కేవలం మన చేతులతో చేసే పనులను కాకుండా.. మనం మెదడుతో చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని వర్మ పేర్కొన్నారు.

మనిషికి రెండు బలాలు
మనిషికి ప్రధానంగా రెండు బలాలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఒకటి శారీరక శక్తి, అంటే.. కష్టపడి పనిచేయడానికి ఉపయోగించే కండరాల బలం. రెండోది మేధస్సు, అంటే.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలను సృష్టించడం.

పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యంత్రాలు మనుషులు చేసే అనేక శారీరక పనులను చేయడం ప్రారంభించాయి. ఫ్యాక్టరీల్లో యంత్రాలు రావడంతో మనిషి చేయాల్సిన శారీరక శ్రమ తగ్గింది. ఇప్పుడు ఏఐ రావడంతో మనిషి చేసే మేధోపరమైన పనులు కూడా ఆటోమేట్ అవుతున్నాయని చెప్పారు.

ఉద్యోగాలు వాళ్ల చేతుల్లోకి!
ఇప్పటికే ఏఐతో రాయడం, డిజైన్లు రూపొందించడం, డేటాను విశ్లేషించడం, కోడింగ్ చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం వంటి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరిగితే.. కొన్ని ఉద్యోగాల్లో మనుషుల అవసరం భారీగా అవకాశం ఉంది. అందుకే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కంటే, ఏఐని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తున్నారో.. అలాంటి వాళ్ల చేతుల్లోకి ఉద్యోగాలు వెళ్ళిపోతాయని వర్మ వెల్లడించారు. పాత పద్దతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాలనుకునే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

చివరగా ''నువ్వు కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు.. అది నిజమైపోవచ్చు'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంటే.. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని, ఎక్కువ ఖాళీ సమయం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేసే దిశగా వెళ్తోంది. కానీ ఆ కోరిక నిజమైతే?.. మన ఉద్యోగాలు, మన అవసరం, చివరకు మనిషిగా మన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement