ఇంగ్గిష్‌ వస్తే.. డబుల్‌ ఓకే.! | English is the key to jobs higher education and international opportunities | Sakshi
Sakshi News home page

ఇంగ్గిష్‌ వస్తే.. డబుల్‌ ఓకే.!

Sep 6 2026 5:39 AM | Updated on Sep 6 2026 5:46 AM

English is the key to jobs higher education and international opportunities

ఉద్యోగాలు, ఉన్నత విద్య, అంతర్జాతీయ అవకాశాలకు ఆంగ్లమే కీలకం  

వేతనాల్లోనూ ప్రత్యేక స్థానం 

అధ్యయనాలు, నివేదికల వెల్లడి 

సాక్షి, అమరావతి: ఇంగ్లిష్.. కేవలం ఒక భాష కాదు. ఉన్నత విద్య, ఉద్యోగం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపారం, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానానికి అదొక కీలక నైపుణ్యంగా మారింది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్, హెల్త్‌కేర్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, రిటైల్, మీడియా వంటి రంగాల్లో ఇంగ్లిష్ లో మాట్లాడటం, రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం తెలిసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.  ఇంగ్లిష్‌ నేర్చుకోవడం అంటే మాతృభాషను వదిలేయడం కాదు. అయితే భవిష్యత్తు ఉద్యోగ ప్రపంచంలో డొమైన్‌ నాలెడ్జ్, డిజిటల్‌ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యంతోపాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ ఉంటే అవకాశాల పరిధి మరింత విస్తరిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. 
» ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌(ఈటీఎస్‌) 2026 గ్లోబల్‌ ఇంగ్లీష్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా కార్యాలయాల్లో ఆంగ్ల ప్రావీణ్యం అవసరం పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 81 శాతం మంది హెచ్‌ఆర్‌ అధికారులు  చెబుతున్నారు.  
» ఈటీఎస్‌  విడుదల చేసిన భారత ఉద్యోగ మార్కెట్‌ విశ్లేషణ ప్రకారం 91 శాతం మంది భారతీయ యజమానులు ఉద్యోగ మార్కెట్‌లో పోటీ పెరగడంతో ఇంగ్లిష్‌ ప్రావీణ్యానికి డిమాండ్‌ పెరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ సహకారం కోసం ఇంగ్లీషు అవసరం పెరుగుతోందని 94 శాతం మంది భారతీయ హెచ్‌ఆర్‌లు పేర్కొన్నారు. 
» బ్రిటీష్‌ కౌన్సిల్, నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి సంబంధించిన పరిశోధనలో 21 ప్రధాన రంగాలను పరిశీలించగా.. సగానికిపైగా రంగాల్లో ఇంగ్లిష్ ను ముఖ్యమైన అదనపు నైపుణ్యంగా గుర్తించారు. ఐటీ, ఐటీఈఎస్, మీడియా, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్, రిటైల్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, హెల్త్‌కేర్‌ వంటి రంగాల్లో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం ప్రత్యేకంగా కనిపించింది. దాదాపు 47 శాతం భారతీయ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్‌ భాష సరిగ్గా మాట్లాడలేకపోవడం కారణంగా పలు రంగాల్లో ఉద్యోగాలకు పూర్తిగా సిద్ధంగా లేరని అధ్యయనం అంచనా 
వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement