తమిళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో కార్తి ఒకడు. ఇతడు చేసిన సినిమాలు.. తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది ఇతడి నుంచి రెండు చిత్రాలు రిలీజయ్యాయి. ఈ నెలలోనే ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ మూవీ చాలా త్వరగా ఓటీటీలోకి రానుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)
2022లో కార్తి నుంచి వచ్చిన సినిమా 'సర్దార్'. పీఎస్ మిత్రన్ దర్శకుడు. అప్పట్లో ఇది తెలుగు, తమిళంలో హిట్ కావడంతో 'సర్దార్ 2' పేరిట సీక్వెల్ తీశారు. ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈసారి ఎస్జే సూర్య విలన్ కాగా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కానీ ఈ మూవీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ గురువారం(అక్టోబరు 01) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అంటే థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే డిజిటల్ రిలీజ్ అనమాట.
'సర్దార్ 2' విషయానికొస్తే.. తొలిభాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ఇన్‌స్పెక్టర్ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్ (కార్తి), రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్ ప్రారంభిస్తాడు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియకుండా మాజీ రా ఏజెంట్ వాల్‌రస్ (అచ్యుత్ కుమార్)ని వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. అప్పటికే ఆ మాజీ ఏజెంట్‌ని యోగానంద్ (ఎస్‌జే సూర్య) నేతృత్వంలోని ప్రమాదకర బ్లాక్ డ్యాగర్ ముఠా వెంటాడుతుంటుంది.
వాళ్ల దాడిలోనే వాల్‌రస్ కన్నుమూయగా.. తను చనిపోయే ముందు విజయ్‌కి ‘మిషన్ డోకు’ అంటూ కత్తి లాంటి ఆకారంలో ఉన్న ఓ తాళాన్ని అందించి, మరో పదిరోజుల్లో దేశంలో పెద్ద విధ్వంసం జరగనుందని చెప్పి కన్నుమూస్తాడు. మిషన్ డోకుతో దేశాన్ని నాశనం చేసేందుకు బ్లాక్ డ్యాగర్ పన్నిన కుట్రని ఛేదించేందుకు తన కొడుకు విజయ్‌తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
🚨 ATTENTION: a new mission brief is in 👀🔥#Sardar2OnPrime, Oct 1st @Karthi_Offl @Prince_Pictures @Psmithran @iam_SJSuryah @ivyofficial2023 @SamCSmusic @george_dop @editorvijay @rajeevan69 @lakku76 pic.twitter.com/vTonM0UT8t
— prime video IN (@PrimeVideoIN) September 28, 2026


