పెళ్లి తర్వాత జ్యోతిక నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు కానీ | Suriya Father Sivakumar Reveals His Son Marriage With Jyotika | Sakshi
Sakshi News home page

Suriya Jyotika: జ్యోతికనే పెళ్లి చేసుకుంటానని సూర్య పట్టుబట్టాడు

Sep 28 2026 2:00 PM | Updated on Sep 28 2026 2:25 PM

Suriya Father Sivakumar Reveals His Son Marriage With Jyotika

కొన్ని సెలబ్రిటీ జంటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వాళ్లలో సూర్య-జ్యోతిక కచ్చితంగా ఉంటారు. కలిసి సినిమాలు చేశారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. ఇదంతా జరిగి చాన్నాళ్లయిపోయింది. అయితే రీసెంట్‌గా 20వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఆ విషయంలో తమిళం కంటే తెలుగోళ్లే బెటర్: సూర్య)

అయితే పెళ్లి తర్వాత చాలా ఏళ్లు చెన్నైలో ఉన్న జ్యోతిక.. కొన్నేళ్ల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. దీంతో ఈమె ఇలా ఎందుకు చేసింది? అత్తమామలతో గొడవలే కారణమా అని సోషల్ మీడియాలో చాలా మాట్లాడుకున్నారు. అయితే ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన జ్యోతిక మామ, సూర్య తండ్రి శివకుమార్ ఆసక్తికర సంగతులు బయటపెట్టారు.

'సూర్యకు పెళ్లిపై మొదటి నుంచే స్పష్టమైన అభిప్రాయం ఉండేది. అతడి తల్లి ఓసారి.. 'ఎవరినైనా ప్రేమించొచ్చు కదా' అని అడిగితే ఎవరిని పడితే వాళ్లని ప్రేమించలేం అని సూర్య అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జ్యోతికతో ప్రేమలో పడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆమె కోసం దాదాపు నాలుగేళ్లు ఎదురుచూశాడు. చివరకు తన అనుకున్నట్లే 2006లో జ్యోతికని వివాహమాడాడు. పెళ్లి తర్వాత సూర్యతో కలిసి ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడే అవకాశమున్నప్పటికీ జ్యోతిక అలా చేయలేదు. 18 ఏళ్లు మా కుటుంబంతోనే ఉంది. పెళ్లి తర్వాత జ్యోతికకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లతో పాటు కుటుంబ బాధ్యతల్ని కూడా చూసుకుంది' అని శివకుమార్ చెప్పుకొచ్చారు.

సూర్య, జ్యోతిక తొలిసారి 1999లో రిలీజైన 'పూవెల్లం కేట్టుప్పర్' సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఉయిరిలే కలంతతు, కాక్క కాక్క, పెరళగన్, మాయావి, సిల్లును ఒరు కాదల్ తదితర మూవీస్ చేశారు. వీళ్లకు దియా, దేవ్ అని ఇద్దరు పిల్లలున్నారు. కెరీర్ పరంగా సూర్య.. ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు. జ్యోతిక కూడా ఓటీటీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement