‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫహాద్ ఫాజిల్. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. అయితే తాజాగా తమిళనాడులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ పాల్గొని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
ఇదీ చదవండి: డింపుల్ డెడికేషన్‌కి ఫిదా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తనను ఒకే ఒక్క లైన్‌తో కట్టిపడేసింది. ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన కథ ఇది అనే ఒక్క లైన్‌లోని మాట వినగానే పూర్తిగా హుక్ అయ్యాను. ఆ లైన్‌లోనే ఆసక్తి, ఉత్కంఠ, వినోదం ఉన్నాయి. ఆ తర్వాత పూర్తి కథ విన్నప్పుడు ఇది అద్భుతమైన కథ అనిపించింది అని రాజమౌళి తెలిపారు. ఇక సినిమాలో సూరి పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవం పోశారని రాజమౌళి ప్రశంసించారు. డబ్బింగ్, మ్యూజిక్ లేకుండా ఫస్ట్ కాపీ చూసినప్పటికీ సినిమా తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయానని వెల్లడించారు.
హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో..
కాగా అల్లావుద్దీన్ స్టైల్లో మాయలు, మంత్రాలు తెలిసిన ఓ చిన్న పాప.. హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అనే విషయాల్ని ట్రైలర్‌లో కామెడీగా చూపించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మరి మలయాళంలో ఇప్పటికే హిట్స్ అందుకున్న ఫహాద్‌కి తెలుగులో హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి?
ఇదీ చదవండి: ‘అన్నా.. అని పిలిచా కదరా.. చిన్న పిల్లాడ్ని చేసి ఇలా..


