బిగ్‌బాస్ బ్యూటీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్య షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 65 ఏళ్లు రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్‌పై దాడి చేసి రూ.5 లక్షల దోపీడీ చేశారని ఆమెపై కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం.. ఆమెను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 30 వరకు పోలీసు కస్టడీ విధించింది. కాగా.. దివ్య షిండే బిగ్ బాస్ మరాఠీ సీజన్- 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాతే ఆమెకు ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాతే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.1 మిలియన్లకు పైగా చేరింది. దీంతో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అలా డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్ ఆయన ఎన్జీవో ఈవెంట్‌ను దివ్య సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసింది. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో వైద్యునిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు చేయడం వల్లే దివ్య షిండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


