బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో రోజురోజుకీ ఆట రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ‘టోటల్ డామినేషన్’ అనే థీమ్‌తో ఇంట్లో టాస్కులు కొనసాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోల్లో కంటెస్టెంట్ల మధ్య ఆధిపత్య పోరు, గొడవలు హైలైట్‌గా నిలిచాయి.
ముఖేష్ త్యాగంతో అపూర్వకు కెప్టెన్సీ
ముఖేష్, అపూర్వ కలిసి టాస్క్‌లో ఆడి విజయం సాధించారు. దీంతో ముఖేష్‌ను కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే వర్షిణి, వంశీ కోసం ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. దీంతో అతడితో కలిసి టాస్క్‌లో గెలిచిన అపూర్వను తదుపరి కెప్టెన్‌గా నాగార్జున ప్రకటించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రోమోలో కనిపించింది. ఈ క్రమంలో ముఖేష్, త్రిగుణ్‌లతో అపూర్వకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అసలు వీరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది? అనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది.
కత్తుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ
మరో ప్రోమోలో ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఒక్కో కత్తిని ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చాడు. ఒక కంటెస్టెంట్ వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ కత్తులు ఉంటే వారికి ప్రత్యేక అధికారం లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో కత్తులను సొంతం చేసుకునేందుకు కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఇంట్లో రెండు వర్గాలు ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నరేశ్ వద్ద ఉన్న కత్తిని రాంప్రసాద్, రోహిత్ కలిసి తీసుకునేందుకు ప్రయత్నించారు. రోహిత్ నరేశ్‌ను ఎత్తుకెళ్లగా.. రాంప్రసాద్ అతడి వద్ద ఉన్న కత్తిని తీసుకున్నాడు. దీంతో నరేశ్ తన కత్తిని తిరిగి ఇవ్వాలని పదేపదే అడిగాడు.
నా కత్తి నాకు ఇవ్వండి
‘నా కత్తి నాకు ఇవ్వండి’ అంటూ నరేశ్ తన టీమ్ సభ్యులను పిలిచాడు. అయితే తాము ఎలాంటి ఫిజికల్ చేయలేదని సుధీర్ చెప్పాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. ఫిజికల్‌గా చేయకుండా కత్తిని ఎలా లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించాడు. దీంతో నరేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘చిన్న పిల్లాడ్ని చేసి ఆడుకున్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా రాంప్రసాద్‌ను ఉద్దేశించి ‘అన్నా అని పిలిచా కదరా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కత్తుల టాస్క్ బిగ్‌బాస్ ఇంట్లో మరింత వేడిని పెంచినట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ‘అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్‌కి కాదు’.. స్లమ్‌డాగ్ గ్లింప్స్


