వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి | Demands by Village and Ward Secretariat employees | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి

Sep 28 2026 3:25 AM | Updated on Sep 28 2026 3:25 AM

Demands by Village and Ward Secretariat employees

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్‌

సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగులపై సర్కారు ఉక్కుపాదం మోపినా వారెవరూ వెరవలేదు. పోలీసులను ప్రయోగించినా.. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా.. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా భయపడలేదు. తమ ఆవేదనను తెలియజేయడానికి వివిధ మార్గాల ద్వారా విజయవాడలోని ధర్నా చౌక్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. పోలీసులు హెచ్చరించినా.. లాఠీలు ఝుళిపించినా.. క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని భయపెట్టినా బెదరకుండా వారి ఆవేదనను వెల్లడించారు. తమకు వెట్టిచారికీ నుంచి విముక్తి కల్పించాలని, నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..

బాసిజం తగ్గించాలి 
సచివాలయ ఉద్యోగులమంటే చులకన అయిపోయాం. మాపై బాసిజం పెరిగిపోయింది. పని ఒత్తిడితో సతమతమవుతున్నాం. అనధికారిక డిప్యుటేషన్లతో నలిగిపోతున్నాం. అయినా మా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి మనసు ఒప్పడంలేదు. 650 మంది సచివాలయ ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. వారి కుటుంబాలకు దిక్కెవరు? తక్షణమే మా డిమాండ్లు పరిష్కరించాలి.     – ధనలక్ష్మి, సచివాలయ ఉద్యోగి, గుంటూరు 

మేం మర యంత్రాలమా?
సచివాలయ ఉద్యోగులంటే మర యంత్రాల్లా ప్రభుత్వం చూస్తోంది. ఒక జాబ్‌చార్ట్‌ లేకుండా అన్ని పనులు చెబుతోంది. అన్ని శాఖల అధికారులు మాపై పెత్తనం చెలాయిస్తున్నారు. మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మాత్రం కల్పించడంలేదు. న్యాయమైన మా డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆందోళనబాట పట్టాం. ప్రభుత్వం పోలీసులతో అణగదొక్కించడం అన్యాయం. మహిళా ఉద్యోగులని చూడకుండా జుట్టు పట్టుకుని లాగి ఈడ్చిపడేశారు. – సుంకర మహాలక్ష్మి, సచివాలయ ఉద్యోగి 

సాకులు మానుకోవాలి 
సచివాలయ ఉద్యోగులతో అన్ని రకాల పనులు చేయిస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి మాత్రం సాకులు చెబుతోంది. 1,896 మంది పశుసంవర్థక సహాయకుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయకుండా తాత్సారం చేస్తోంది. మాతో 24 గంటలూ రకరకాల పనులు చేయిస్తోంది. పనిఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయలేదు. సస్పెన్షన్ల పేరుతో బెదిరించడం దారుణం. – కేవీ రాజశేఖర్‌బాబు, పశుసంవర్థక సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సమస్యలు చెప్పడానికి స్వేచ్ఛలేదా?
అన్ని శాఖల పనులు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు. మల్టీ బాసిజమ్‌తో నలిగిపోతున్నాం. 423 జీఓ అమలుకాకముందే శానిటేషన్‌ సెక్రటరీలపై ఒత్తిడి పెంచారు. కానీ, ఆర్థికపరమైన ప్రయోజనాలను మాత్రం ప్రభుత్వం కల్పించడంలేదు. మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే క్రిమినల్స్‌ను చూసినట్లు చూస్తున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.  – సృజన, సచివాలయ ఉద్యోగి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement