పి.గన్నవరం(డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా): ఇటీవల పి గన్నవరం ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ సమక్షంలో తమ పార్టీ నుంచి భారీ చేరికలు అని చెప్పి మీడియాను తప్పుదోవ పట్టించారని వైఎస్సార్‌సీపీ నేత గన్నవరపు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేన పార్టీలో చేర్చుకొని, వారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా చూపించారన్నారు.
ముంగండపాలెంలో టిడిపి కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చారని చెబుతున్న వారి టీడీపీ సభ్యత్వాలు బయటపెడుతున్నామన్నారు. టీడీపీ నేతలను జనసేనలో చేర్చుకునే ఈ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.


