‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’ | Ysrcp Mlc Lella Appi Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’

Sep 27 2026 4:45 PM | Updated on Sep 27 2026 5:03 PM

Ysrcp Mlc Lella Appi Reddy Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఈ నిరంకుశ పాలనలో ఎవరికీ రక్షణ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలపై నిరసనలు తెలిపితే అరెస్టులు చేయటం దుర్మార్గం అంటూ దుయ్యబట్టారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతారా?’’ అంటూ నిలదీశారు.

‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు సహించలేక పోతోంది?. ఉన్నతాధికారులతో గ్రామ సచివాలయ ఉద్యోగులను వేధించటం అన్యాయం. ఉద్యోగులపై వేధింపులను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటోంది. సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు విదేశాలలో రహస్య పర్యటనకు వెళ్లటం సిగ్గుచేటు. శాప్ ఆఫీసు ఎదుట నకిలీ టీచర్లతో నకిలీ ధర్నాలు చేయించిన ఘనత ఈ ప్రభుత్వానిది’’ అని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘గ్రామ సచివాలయ ఉద్యోగులు ధర్నా చేయిద్దని  పోలీసులతో నోటీసులు ఇప్పిస్తారా?. ఉద్యోగులకు సమస్యలు ఉండవా? పరిష్కారం కోరుకోకూడదా?. ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేయడం దుర్మార్గపు చర్య. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా చిన్నవారు. అలాంటి వారిపైకి పోలీసులను ఉసిగొల్పటం అన్యాయం. సాటి ఉద్యోగుల విషయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలి. తోటి ఉద్యోగులపై లాఠీలు ఝుళిపించటం సరికాదు’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా పని చేసింది ఈ నిరుద్యోగులే. అలాంటి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వటం లేదు. ఈ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement