ఆ ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది: మార్గాని భరత్‌ | Ysrcp Bc Garjana Sabha In Rajahmundry Rural Katheru | Sakshi
Sakshi News home page

ఆ ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది: మార్గాని భరత్‌

Sep 27 2026 2:05 PM | Updated on Sep 27 2026 3:19 PM

Ysrcp Bc Garjana Sabha In Rajahmundry Rural Katheru

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బీసీలు పనికిరారా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్‌ కాతేరులో నిర్వహించిన ‘వెన్నుపోటు పార్టీ వంచన’పై బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశం వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉంది. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా తీర్పు ఇవ్వాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల యుద్ధం మన ఆత్మగౌరవానికి సంబంధించింది.‌ ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలని మార్గాని భరత్‌ పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. మన నాయకుడు గతంలోనే జయహో బీసీ అంటూ నినాదం ఇచ్చారు. వెన్నుపోటు నాయకులు అలవికాని, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎంతకాలం ఇటువంటి పరిపాలన?. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా గుర్తించింది వైఎస్‌ జగన్‌ మాత్రమే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తామని ఇప్పుడు చెప్పటం మరో వెన్నుపోటు. బీసీలు గుర్తింపు పెరగాలంటే వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని  చేసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేందుకు సిద్ధంగా ఉండండి. ఉభయ గోదావరి జిల్లాల్లో మార్పు వచ్చింది‌.‌ దానికారణం బీసీలే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లో ఇంటికి ఇద్దరు ఉద్యోగస్తులయ్యారంటే అది కేవలం వైఎస్సార్ చలవే. సాధారణ నాయకులను సైతం అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది.. 29 రాష్ట్రాల్లో ఓకే నాయకుడు.. ఒకే పార్టీ, ఒకే అజెండాతో 40 శాతం ఓట్లు సాధించిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement