తల్లిదండ్రులిద్దరూ వైద్యులు.. కూతుళ్లిద్దరూ డాక్టర్లే.. | Dr Peddireddy Prabhakar Reddy Family Success Story | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులిద్దరూ వైద్యులు.. కూతుళ్లిద్దరూ డాక్టర్లే..

Sep 27 2026 9:36 AM | Updated on Sep 27 2026 9:38 AM

Dr Peddireddy Prabhakar Reddy Family Success Story

కుమార్తెలు గ్రీష్మబిందు, నవ్యశ్రీలతో డాక్టర్‌ పెద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భాగ్యమ్మ దంపతులు

వైఎస్ఆర్ కడప జిల్లా: ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఏనాడూ దిగులు పడలేదు.. ఇద్దరూ ఆడపిల్లలే అయ్యారని అస్సలు అధైర్యపడలేదు. పైగా వారిని కొడుకులతో సమానంగా, ఎంతో బాధ్యతగా పెంచారు. తాము నమ్ముకున్న పవిత్రమైన వృత్తినే ఆ బిడ్డలకు స్ఫూర్తిగా చూపించారు. ఫలితంగా తల్లిదండ్రులిద్దరూ వైద్యులు.. కూతుళ్లిద్దరూ వైద్యులే అయి, ఒకే కుటుంబంలో నాలుగు వైద్య దీపాలను వెలిగిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ పెద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చిల్డ్రన్స్ స్పెషలిస్టుగా, ఆయన భార్య డాక్టర్‌ భాగ్యమ్మ గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు.  వైద్య వృత్తిలో వారు చూపిన అంకితభావాన్ని చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగిన వారి ఇద్దరు కుమార్తెల్లోనూ వైద్యులుగా ఎదగాలన్న ఆకాంక్ష బలంగా నాటుకుంది. కూతుళ్లను కేవలం చదివించడం మాత్రమే కాకుండా.. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, దానిని చేరుకునే వరకు కష్టపడేలా తల్లిదండ్రులు తీర్చిదిద్దారు. 

స్కిన్‌ స్పెషలిస్ట్‌గా పెద్ద కుమార్తె..  
పెద్ద కుమార్తె గ్రీష్మబిందు 2016లో నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజ్‌లో ఎండీ పూర్తి చేసి, ప్రస్తుతం స్కిన్‌ స్పెషలిస్ట్‌గా మారి రోగులకు అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. 

ఢిల్లీ వేదికగా చిన్న కుమార్తె..  
చిన్న కుమార్తె నవ్యశ్రీ సైతం అక్క, కన్నవారి అడుగుజాడల్లోనే నడిచారు. ఈమె 2020లో దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్‌హెచ్‌ఎంసీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. తాజాగా వైద్య విద్యను అత్యంత విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా తల్లిదండ్రుల వృత్తిని చూసి ప్రేరణ పొందిన ఇద్దరు కుమార్తెలు.. అదే వృత్తిని ఎంచుకొని తమ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చడం విశేషం. 

‘ఇద్దరు ఆడపిల్లలే అని ఎప్పుడూ బాధపడలేదు’ 
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి దంపతులు 
‘మాకు ఇద్దరు కూతుళ్లు పుట్టారని ఏనాడూ బాధపడలేదు. ఆడపిల్లలను చక్కగా చదివించి, తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పెంచాం. పిల్లలకు లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా.. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వారికి అండగా నిలిచాం. ఆడపిల్లలు పుట్టడం లోటు కాదు.. వారికి సరైన విద్య, ప్రోత్సాహం, అవకాశాలు అందిస్తే కుటుంబానికే కాదు.. సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు.’  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement