బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ : వైఎస్సార్‌సీపీ నేతలు | Political Heat in East Godavari: YSRCP Leaders Lead Massive BC Garjana Protest | Sakshi
Sakshi News home page

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ : వైఎస్సార్‌సీపీ నేతలు

Sep 27 2026 4:33 PM | Updated on Sep 27 2026 5:01 PM

Political Heat in East Godavari: YSRCP Leaders Lead Massive BC Garjana Protest

సాక్షి,తూర్పుగోదావరి : వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, బొత్స సత్యనారాయణ, విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.

ఈ సందర్భంగా రాజ్యాధికారం ఉంటేనే సమాజం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంతోనే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బలంగా ఉండగలమని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత బీసీలను ఏ ప్రభుత్వాలు గుర్తించాయి. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను బ్యాక్‌వర్డ్ కాదు బ్యాక్‌బోన్ అని చెప్పిన ఏకైక నాయకుడు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని రమేష్‌ యాదవ్‌ కొనియాడారు. యాదవ సమాజంలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీ వర్గానికి కేటాయించాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లమేనని పేర్కొన్న మాజీ మంత్రి విడదల రజిని.. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడెక్కడ గుర్తింపు లోపించిందనే దానిపై అధ్యయనం జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం ఇప్పటిదాకా రాలేదని, మహిళలకు అందిస్తామన్న సహాయం అందలేదని, లబ్ధిదారులకు పింఛన్లు కూడా తగ్గిపోయాయని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement