సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కాంగ్రెస్–బీజేపీ అపవిత్ర బంధానికి రెండేళ్లు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఈడీ దాడులకు రెండేళ్లు’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
‘‘2024 సెప్టెంబర్ 27న 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. దాడుల సమయంలో నగదు లెక్కించే యంత్రాల తరలింపుపై వార్తలు. ఈడీ దాడుల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో ఇప్పటికీ వెల్లడించలేదు. దాడుల ఫలితాలపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నాయి?’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Exactly two years since the Congress-BJP unholy nexus became official in Telangana
The Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024
Reports of several… pic.twitter.com/Ss2eIguoP6— KTR (@KTRBRS) September 27, 2026
‘‘ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ.. కాంగ్రెస్ మంత్రిపై దాడుల విషయంలో మాత్రం ఎందుకీ మౌనం?. కాంగ్రెస్ మంత్రి పొంగులేటికి బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తోంది?. రాహుల్ గాంధీ.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే?


