breaking news
unholy alliance
-
రాహుల్.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కాంగ్రెస్–బీజేపీ అపవిత్ర బంధానికి రెండేళ్లు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఈడీ దాడులకు రెండేళ్లు’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘2024 సెప్టెంబర్ 27న 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. దాడుల సమయంలో నగదు లెక్కించే యంత్రాల తరలింపుపై వార్తలు. ఈడీ దాడుల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో ఇప్పటికీ వెల్లడించలేదు. దాడుల ఫలితాలపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నాయి?’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.Exactly two years since the Congress-BJP unholy nexus became official in TelanganaThe Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024Reports of several… pic.twitter.com/Ss2eIguoP6— KTR (@KTRBRS) September 27, 2026‘‘ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ.. కాంగ్రెస్ మంత్రిపై దాడుల విషయంలో మాత్రం ఎందుకీ మౌనం?. కాంగ్రెస్ మంత్రి పొంగులేటికి బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తోంది?. రాహుల్ గాంధీ.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే? -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
స్వర్ణ దేవాలయంలో కలకలం
అమృత్సర్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్‌పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు. -
టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య
టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తని సామాజికవేత్త కంచె ఐలయ్య విమర్శించారు. సీమాంధ్ర ప్రజలు ఈ పార్టీలు రెండింటినీ తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబు దేశద్రోహి అని, కేవలం అధికారం కోసమే ఆయన బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని ఐలయ్య మండిపడ్డారు. అసలు చిన్న రాష్ట్రాల ఏర్పాటును ప్రారంభించినదే బీజేపీ అని, ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే తాము ప్రవపేశపెడతామని బీజేపీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి విభజనకు కారణమైన బీజేపీ, టీడీపీ కలిసి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయని ఐలయ్య ప్రశ్నించారు.


