టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య | tdp and bjp are in unholy alliance, says kancha ilaiah | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య

May 1 2014 1:34 PM | Updated on Aug 14 2018 4:24 PM

టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య - Sakshi

టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య

టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తని సామాజికవేత్త కంచె ఐలయ్య విమర్శించారు. సీమాంధ్ర ప్రజలు ఈ పార్టీలు రెండింటినీ తిరస్కరిస్తారని ఆయన చెప్పారు.

టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తని సామాజికవేత్త కంచె ఐలయ్య విమర్శించారు. సీమాంధ్ర ప్రజలు ఈ పార్టీలు రెండింటినీ తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబు దేశద్రోహి అని, కేవలం అధికారం కోసమే ఆయన బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని ఐలయ్య మండిపడ్డారు.

అసలు చిన్న రాష్ట్రాల ఏర్పాటును ప్రారంభించినదే బీజేపీ అని, ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే తాము ప్రవపేశపెడతామని బీజేపీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి విభజనకు కారణమైన బీజేపీ, టీడీపీ కలిసి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయని ఐలయ్య ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement