
పట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత దారుణ హత్య గురయ్యారు. రాజ్‌కుమార్ రాయ్‌ను దుండగులు కాల్చి చంపారు. బుధవారం రాత్రి పాట్నాలోని చిత్రగుప్త్ ప్రాంతంలోని మున్నాచక్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ రాయ్.. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.
భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాయ్ భూమి కొనుగోలు, అమ్మకాల్లో వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.