కరీంనగర్‌లో బీభత్సం: భర్త వివాహేతర సంబంధం గుట్టు ర‌ట్టు.. | Wife Exposed Husband Illegal Affair | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బీభత్సం: భర్త వివాహేతర సంబంధం గుట్టు ర‌ట్టు..

Sep 27 2026 11:05 AM | Updated on Sep 27 2026 11:05 AM

Wife Exposed Husband Illegal Affair

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ శివారు ఆరెపల్లిలో వివాహేతర సంబంధం విషయమై దంపతుల మధ్య నెలకొన్న వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఫ్యాక్షన్‌  తరహాలో కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కరీంనగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో 15మందిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆరెపల్లి హన్మాన్‌నగర్‌లో రాజు– లావణ్య దంపతులు నివాసముంటున్నారు. రాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో లావణ్య రెండునెలలక్రితం పుట్టింటికి వెళ్లింది. 

భార్యను బాగా చూసుకుంటానని చెప్పి ఇటీవల ఇంటికి తీసుకొచ్చిన రాజు, మళ్లీ వేధించడంతో కుటుంబసభ్యులకు చెప్పింది. శనివారం హన్మాన్‌నగర్‌కు వచ్చిన లావణ్య కుటుంబసభ్యులతో రాజు కుటుంబసభ్యులు గొడవపడ్డారు. ఇరువర్గాల నడుమ వివాదం పెరిగి కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో ఆరుగురు గాయపడగా లావణ్య తల్లి తల పగిలి పోయింది. తండ్రి, సోదరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో 15మందిపై కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement