breaking news
husband illegal affair
-
ఫేస్బుక్ పరిచయంతో ప్రేమ పెళ్లి
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని పోసానీపేట గ్రామంలో భర్త ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఓ భార్య ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు సంజన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంజన ఐదేళ్ల కిత్రం రామారెడ్డి మండలం పోసానీపేట గ్రామానికి చెందిన గాండ్ల ప్రవీణ్‌కు ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం అనంతరం ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. వివాహం జరిగి రెండేళ్లు అయింది. తన భర్త ప్రవీణ్ అక్రమ సంబధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సంజన ఆరోపించింది. అలాగే తను గతంలో అనేక సార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం భర్త ప్రవీణ్ ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది. -
వివాహిత ఆత్మహత్య
రాయగడ : జేకేపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, జగదాంబ రైస్‌మిల్ యజమాని కిల్లాన శ్రీనివాస్ భార్య కిల్లాన రాణి ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి ఆరళ్లు, భర్త వివాహేతర సంబంధం కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. జేకేపూర్‌కు చెందిన కిల్లాన శ్రీనివాస్‌కు, గుమ్మడ సమీపంలోని విందుపురానికి చెందిన రాణికి 22 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి సమంత, మౌని క ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, రెండో కుమార్తె విశాఖపట్నంలో చదువుతున్నారు. శ్రీనివాస్‌కు జేకేపూర్‌లోని ఒక ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉందని, ఆమె ప్రస్తుతం గర్భవతి అని చెబుతున్నారు. దీంతో శ్రీనివాస్, రాణి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుధవారం రాత్రి 7గంటలకు ఓంశాంతి పూజకు వెళుతున్నానని చెప్పి రాణి వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పుట్టింటి వాళ్లు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త, కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మజ్జిగౌరి మందిరం సమీపంలోని రైలు పట్టాలపై మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. 10 గంటల సమయంలో మృతురాలు రాణిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆమెకు మతి స్థిమితం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రీనివాస్ తెలిపారు. జీఆర్పీ పోలీసులు కేసు చేశారు. ఓఐసీ గణపతి బెహరా కేసు దర్యాప్తు చేస్తున్నారు.