ఫేస్‌బుక్‌ పరిచయంతో ప్రేమ పెళ్లి | Husband Illegal Affair Wife Protest Nizamabad | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పరిచయంతో ప్రేమ పెళ్లి

Jun 12 2019 12:21 PM | Updated on Jun 12 2019 12:21 PM

Husband Illegal Affair Wife Protest Nizamabad - Sakshi

రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని పోసానీపేట గ్రామంలో భర్త ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఓ భార్య ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు సంజన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంజన ఐదేళ్ల కిత్రం రామారెడ్డి మండలం పోసానీపేట గ్రామానికి చెందిన గాండ్ల ప్రవీణ్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం అనంతరం ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. వివాహం జరిగి రెండేళ్లు అయింది.

తన భర్త ప్రవీణ్‌ అక్రమ సంబధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సంజన ఆరోపించింది. అలాగే తను గతంలో అనేక సార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం భర్త ప్రవీణ్‌ ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement