తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి | Three Children Lose Lives in Tragic Incident In Nizamabad District | Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి

Jun 5 2026 8:34 PM | Updated on Jun 5 2026 8:42 PM

Three Children Lose Lives in Tragic Incident In Nizamabad District

నిజామాబాద్‌:  జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ  వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు. 

పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని  ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement