భర్త ఆత్మహత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్ | Nizamabad Wife and Husband Incident | Sakshi
Sakshi News home page

భర్త ఆత్మహత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

Jul 11 2026 7:19 AM | Updated on Jul 11 2026 7:19 AM

Nizamabad Wife and Husband Incident

 కటకటాలపాలైన భార్య, ప్రియుడు 

బోధన్‌(నిజామాబాద్‌): భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య.. ప్రియుడితో కలిసి అతడి మరణాన్ని సహజమరణంగా చిత్రించేందుకు యత్నించి పోలీసులకు చిక్కింది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన  కురుమ మల్లయ్య అలియాస్‌ మహిపాల్‌ (27), భార్య స్వరూప ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. మల్లయ్య తల్లి గ్రామంలోనే విడిగా ఉంటోంది. గ్రామానికి చెందిన సుమన్‌తో స్వరూప వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో మల్లయ్య మనస్తాపానికి గురై గత నెల 30వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

భర్త ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్వరూప ఆమె ప్రియుడు సుమన్‌కు తెలపగా.. అతను ఇంటికి చేరుకుని ఉరిని తొలగించాడు. భర్త మల్లయ్యది సహజ మరణమని స్వరూప గ్రామస్తులను నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేయించింది. ఈ క్రమంలో మల్లయ్య గొంతుపై గాట్లు కనిపించడంతో మృతుని తల్లి  పోలీసులకు సమాచారం ఇవ్వగా,  మల్లయ్యది సహజ మరణం కాదని, ఆత్మహత్య అని తేల్చా రు. అతని ఆత్మహత్యకు కారణమైన స్వరూపతోపాటు ఆమె ప్రియుడు సుమన్‌ను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement