బీఎల్‌ఏలు బీఎల్‌వోలకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు బీఎల్‌వోలకు సహకరించాలి

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను పూర్తి చేసేందుకు బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకారం అందించాలని, ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను పూరించి అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ పవన్‌కుమార్‌ శర్మ న్యూఢిల్లీ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎస్‌ఐఆర్‌ అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రగతిని అడిగి తెలుసుకుని దిశానిర్దేశం చేశారు.

వీసీ అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి.. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల స్వీకరణ, వాటి వివరాలను డిజిటలైజ్‌ చే యడంలో వెనుకంజలో ఉన్న సూపర్‌వైజర్లపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పురోగతి చూపని నిజామాబాద్‌ అర్బన్‌ పరిధిలోని ముగ్గురు సూపర్‌వైజర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. శని, ఆదివారాలు సెలవు దినాలలో కూడా పని చేయాలని, వచ్చే సోమవారం నాటికి అర్బన్‌లో 35 శాతం, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో 50 శాతం ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు. బీఎల్‌వోలకు సహకారం అందించేలా వీవోఏలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో కూడిన వారిని వలంటీర్లుగా నియమించాలని అధి కారులను ఆదేశించారు. ప్రతి బీఎల్‌వో వద్ద ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండాలన్నారు. వివరాల పరిశీలన సమయంలో అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లి న, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించాలనిఆదేశించారు. జాబితాపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ వి భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement