న్యూస్‌రీల్
నిజామాబాద్
ఎకై ్సజ్ శాఖలో చల్లారని ‘వసూళ్ల’ వ్యవహారం
● ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్‌లను
త్వరితగతిన అందించాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ ఇలా త్రిపాఠి
బీఎల్‌వోలకు ఆర్డీవోల..
సర్ సర్వే ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్‌వోలను బోధన్, బాన్సువాడ ఆర్డీవోలు అభినందించారు.
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు
ఆర్మూర్: పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఆర్మూర్ డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నైట్ పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాల ని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధా న్యత ఇవ్వాలన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, సీఐలు జాన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని తిలక్‌గార్డెన్ సబ్‌స్టేషన్‌లో ఉన్న 11 కేవీ ఎస్‌ఎన్ ఫీడర్‌లో, సుభాష్‌నగర్ సబ్‌స్టేషన్‌లోని 11 కేవీ ఫీడర్‌లో మరమ్మతుల చేపట్టనున్నా మని ఏడీఈ టౌన్–2 ఆర్ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖలీల్‌వాడి, సరస్వతీనగర్, కోర్టు ఏరి యా, సుభాష్‌నగర్, ఎర్రకుంట, ఓల్డ్ ఎన్‌జీవోస్ కాలనీ, ఆర్కే టాకీస్ రోడ్డు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే న్యూ కలెక్టరేట్ సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ కారణంగా సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ప్రసాద్‌రెడ్డి కోరారు.
వేర్వేరు సబ్‌స్టేషన్ల పరిధిలో..
నగరంలోని పవర్‌హౌజ్ కంపౌండ్, అర్సపల్లి, మిర్చి కంపౌండ్ సబ్‌స్టేషన్ల పరిధిలో రెండో శనివారం నిర్వహణ కారణంగా ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ టౌన్–1 ఆర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
నేడు ప్రీప్రైమరీ స్కూళ్ల వస్తువులకు టెండర్లు
ఖలీల్‌వాడి: జిల్లాలోని 112 ప్రీప్రైమరీ స్కూళ్లకు కావాల్సిన వస్తువులకు సంబంధించి టెండర్లు ఈనెల 11 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దక్కించుకున్నవారు స్కూళ్లకు ఫర్నీచర్, ఇండోర్, అవుట్‌డోర్ మెటీరియల్ సప్లయ్‌తోపాటు గోడలపై పెయింటింగ్ వేయించాలన్నారు. ఈనెల 11న ఉదయం 10 గంటలకు నుంచి టెండర్ ఫారాలను లభిస్తాయని, దీనికి రూ.5వేలు చెల్లించాలన్నారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని సర్వశిక్షఅభియాన్ కార్యాలయంలోని రూం నెంబర్–117లో టెండర్ ఫారాలను సమర్పించాలన్నారు. ఈనెల 21న టెండర్లను ఓపెన్ చేస్తారని తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అరెస్టు చేసిన తరువాత ‘వసూళ్ల’ వ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది. ఠంచన్‌గా మామూళ్లు వసూలు చేసి వెళ్లిపోయిన ఉన్నతాధికారి వ్యవహారాన్ని తమ మెడకు చుట్టి వెళ్లిపోయారని కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు సిబ్బంది, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్లు వసూలు చేసిన వారిపై కన్నేసిన ఏసీబీ విచారణ చేస్తోందని తెలియడంతో ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల సమావేశమైన ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రధానంగా దీనిపైనే చర్చించినట్లు తెలిసింది. ఏసీబీ తమ వరకూ వస్తే వసూళ్ల కుండ బద్ధలు కొడతామని, ఎవరి దగ్గర ఎంత వసూలు చేసింది.. ఎవరికి ఎంత ఇచ్చింది బహిర్గతం చేసేస్తామని అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సర్కిల్ వారీగా..
జిల్లాలో ఆర్మూర్, మోర్తాడ్, భీమ్‌గల్, నిజామాబాద్, బోధన్ ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాలు ఉండగా, ఒక్కో కార్యాలయం నుంచి నెలకు రూ.లక్ష చొప్పున పంపించాలని ఉన్నతాధికారి ఎస్‌హెచ్‌వోలకు హుకుం జారీ చేశాడని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నెలలో ఒక్కరోజు కూడా అందుబాటు లో ఉండని ఆ అధికారి కేవలం మామూళ్ల వసూ ళ్ల కోసమే జిల్లాకు వచ్చి తీసుకొని వెళ్లేవాడని, రెండున్నర సంవత్సరాలపాటు ప్రతి సర్కిల్ నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశాడని అంటున్నారు. డబ్బులు ముట్టజెప్పని ఎస్‌హెచ్‌వోలపై మండిపడేవాడని, వసూలు చేసే బాధ్యతను ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేసి పక్క జిల్లాకు ఎస్సైగా పదోన్నతి పై వెళ్లిన ఓ వ్యక్తి నిర్వర్తించేవాడని తెలిసింది. నె లవారీ మామూళ్లు వసూలు కాగానే సదరు అధికారి ఉన్నతాధికారికి సమాచారం ఇస్తే వచ్చి తీసుకెళ్లేవాడని సమాచారం. సదరు ఉన్నతాధికారికి ముట్టజెప్పేందుకు కిందిస్థాయి సిబ్బంది కల్లు డిపోలు, వైన్‌షాపులు, పర్మిట్ రూమ్‌లు, బార్‌లలో విచ్చలవిడిగా వసూలు చేసేవారు. పనిలో పనిగా తమ ‘మామూళ్ల’ను సైతం వసూలు చేసుకునే వారనే ఆరోపణలున్నాయి. కొందరు కానిస్టేబుళ్లు వసూ ళ్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
ఉన్నతాధికారి బాటలో..
వసూళ్ల ఆరితేరిన ఉన్నతాధికారి బాటలోనే కానిస్టేబుళ్లు పయనిస్తున్నారనే విమర్శలున్నాయి. గంజాయి స్మగ్లర్లు, నిషేధిత మత్తుపదార్థాలను సరఫరా చేసే వారిని పట్టుకున్న సమయంలో కేసు తీవ్రత తగ్గిస్తామని వారి నుంచి భారీ మొత్తంలో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వసూలు చేసే వారనే ఆరోపణలున్నాయి. సాలూర ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరుడు నిషేధిత మత్తు పదార్థాలతో అడ్డంగా దొరికినప్పటికీ వదిలేశారని, అలాగే మాధవనగర్ వద్ద భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలు లభించిన వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల ప్రమేయం ఉందని తేలినప్పటికీ వారిని కేసుల నుంచి తప్పించారనే విమర్శలున్నాయి. వీటన్నింటికీ నెలవారీ మామూళ్లే కారణమని అంటున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సుభాష్‌నగర్: జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థు ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఒక స్టాఫ్‌నర్స్, 2 సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంబీబీఎస్, స్టాఫ్‌నర్స్ పోస్టుకు జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అ ర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు పత్రాలను ఈనెల 16న కలెక్టరేట్ లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో (రూమ్‌నం.201) నిర్వహించే వాక్‌ఇన్ నియామక ప్రక్రియలో సమర్పించి హాజరుకావాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను నిజామాబాద్ జిల్లా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఏరు దాటి తెప్ప తగిలేశాడు..
పని చేసినంత కాలం జేబులు నింపుకున్న ఉన్నతాధికారి ఇప్పుడు ఏరు దాటి తెప్ప తగిలేసిన చందంగా మార్చాడని ఎకై ్సజ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఇప్పుడు పూర్తిగా శాఖపై నిఘా సారించిందని, అసలు వసూళ్ల సూత్రధారి బదిలీల్లో తేలికగా తప్పించుకున్నాడని చర్చించుకుంటున్నారు.
నూతన భవనాల నిర్మాణాల కోసమని..
ఏసీబీ ఆరా తీస్తోందని వణుకు
ఉన్నతాధికారి తమ మెడకు
చుట్టిపోయారని ఆవేదన
తాము చిక్కితే బండారం బయటపెడతామంటున్న కిందిస్థాయి సిబ్బంది
నెలవారీ మామూళ్లు వసూలు చేసుకుని బయటపడిన ఉన్నతాధికారి ఆ వ్యవహారాన్ని తమ మెడకు చుట్టిపోయారని ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. తమ వరకు వస్తే ఆ అధికారి వసూళ్ల కుండను బద్దలు కొడతామని అంటున్నారు.
మోర్తాడ్ , భీమ్‌గల్, బోధన్ ప్రాంతాల్లో నూతన ఎకై ్సజ్ కార్యాల సర్కిల్ కార్యాలయాల భవనాలు నిర్మాణం జరిగింది. అయితే భవనాల నిర్మాణానికి డబ్బులు వసూలు చేయాలని ఉన్నతాధికారి ఎస్‌హెచ్‌వోలను, ఎస్సైలను ఆదేశించడం గమనార్హం. భవన నిర్మాణాల పేరుతో రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని కల్లు డిపోల నిర్వాహకులు, నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేసేవారి నుంచి, గంజాయి వ్యాపారం చేసే వారి నుంచి వసూలు చేశారని, ఆ మొత్తాన్ని హైదరాబాద్‌కు పంపించారని సమాచారం.


