సుభాష్‌నగర్: 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. జిల్లాలో 01 నుంచి 19ఏళ్ల విద్యార్థులు 3,90,297 మంది ఉన్నారన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కోటగల్లిలోగల శంకర్‌భవన్ హైస్కూల్ నుంచి జాతీయ నులిపురుగుల నివారణపై అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. ఈనెల 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల లు, కళాశాలల్లో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులందరూ అల్బెండజోల్ మాత్రను బాగా నమిలి మింగాలని తెలిపారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల శుభ్రత పాటించాలన్నారు. డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్, హెచ్‌ఎం సాయ న్న, డీఎస్‌వో గంగాకిషన్, ప్రైమరీ హెచ్‌ఎం రాంచందర్ గైక్వాడ్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, శిఖర, నవ్య తదితరులు పాల్గొన్నారు.


