ఎత్తిపోయిన బోర్లు.. నిలిచిన భగీరథ.. | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోయిన బోర్లు.. నిలిచిన భగీరథ..

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని కంజర్‌ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం, తెలంగాణ సాంఘిక సంక్షేమ బా లికల గురుకుల విద్యాలయంతోపాటు మోపాల్‌ కేజీబీవీలో నీటి కటకట నెలకొంది. దీంతో ఆయా విద్యాలయాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీరు తగ్గిపోయాయి. మరోవైపు మూ డు రోజులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా ఇందల్వా యి నుంచి మండలానికి నిత్యం 6ఎంఎల్‌డీలు (60 లక్షల లీటర్లు) నీటి సరఫరా అ వుతోంది. ఎస్సారెస్పీ వద్ద జలాల్‌పూర్‌లోగల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బో ర్లు ఎత్తిపోవడంతో పూర్తిగా మిషన్‌ భగీరథ నీటిపై ఆధారపడ్డ ఈ గురుకులాలు, కేజీబీవీల్లో సమస్య తీవ్రంగా ఉంది. మూడు పాఠశాలల్లోని సుమారు 2వేల మంది విద్యార్థినీవిద్యార్థులకు మూడు రోజులుగా నీటి తిప్పలు ఎదురయ్యాయి.

జీపీల ట్యాంకర్లతో..

భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా గురుకులాల ప్రిన్సిపాల్స్‌, కేజీబీవీ ఎస్‌వో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. కంజర్‌, మోపాల్‌, నర్సింగ్‌పల్లి, ఒడ్డెరకాలనీ గ్రా మపంచాయతీల ట్రాక్టర్లు రెండు రోజులుగా నీటిని సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ నీటినే విద్యార్థులు కాల కృత్యాలు, ప్లేట్లు, ముఖాలు, చేతులు కడుక్కోవడా నికి వినియోగిస్తున్నారు. మూడు రోజులుగా విద్యార్థులు స్నానాలు చేయడం లేదు. తాగునీటి కోసం ఆర్‌వో ప్లాంట్లను వినియోగించకుండా బయటి నుంచి మినరల్‌ వాటర్‌ తెప్పిస్తున్నారు.

మోపాల్‌ మండలంలోని రెసిడెన్షియల్స్‌, కేజీబీవీల్లో నీటి కటకట

మూడు రోజులుగా

స్నానాలు చేయని విద్యార్థులు

జీపీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement