పాఠశాల విద్యలో ఆరోస్థానం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యలో ఆరోస్థానం

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

ఖలీల్‌వాడి: విద్యా ప్రమాణాలు, పాఠ్యాంశాల బోధనలో నాణ్యత, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, భద్రత తదితర అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ ఫర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ – డిస్ట్రిక్ట్స్‌ (పీజీఐ – డీ)లో రాష్ట్రస్థాయిలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ప్రతి ఏడాది జిల్లాలో ని పాఠశాలల పని తీరును కేంద్ర విద్యాశాఖ అంచనా వేసి రాష్ట్ర పాఠశాల డైరెక్టర్‌కు పంపిస్తుంది. ప్రభుత్వ బడుల్లో క్షేత్రస్థాయిలో ఆరు ప్రధాన అంశాలను పరిశీలించి 2017 నుంచి కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఇటీవల విడుదలైన పాఠశాల విద్యా సూచీ 2025 – 26 పీజీఐ – డీని విడుదల చేసింది. ఆరు విభాగాల్లో 600 మార్కులకు జిల్లా 344 మార్కుల సాధించి రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది.

మార్కులు ఇలా..

600 మార్కుల్లో అత్యధికంగా అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాలకు 290 మార్కులు కేటాయించారు. శిక్షణ పొందిన టీచర్లు ఎంత మంది ఉన్నారు? ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి, విద్యార్థుల అడ్మిషన్లు, హాజరు, డ్రాప్‌ అవుట్‌లు, భాష, గణితం, సైన్స్‌, సామాజిక శా స్త్రాల్లో ప్రతిభను ఆధారంగా తీసుకుంటారు. అయితే టీచర్ల పనితీరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, విద్యాశాఖ సహకారంతో జిల్లా కాస్తా మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ విద్యా సంవత్సరం వివిధ ఆంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

50 శాతం డిజిటల్‌ బోర్డులు ఉన్నా..

జిల్లాలో ప్రభుత్వ బడులకు డిజిటల్‌ బోర్డులను అందించారు. ఇందులో 50 శాతం డిజిటల్‌ బో ర్డులు ఉంటే 28 శాతమే ఉపయోగిస్తున్నారు. దీంతో 22 శాతం వెనుకబడి ఉంది. దీనిపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి డిజిటల్‌ బోర్డు లు ఉన్న పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను అమలు చేస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి వారి అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి.

ప్రచేస్తా – 1లోకి..

కేంద్ర విద్యాశాఖ పీజీఐ – డీ ప్రకటించిన సూచీ లో జిల్లా సాధించిన స్కోర్‌ ప్ర కారం పది కేటగిరీలుగా విభజించి తర్వా త వాటికి గ్రేడింగ్‌ ఇచ్చారు. 600 మార్కులకు గా ను జిల్లా 344 సాధించడంతో ప్రచేస్తా – 1 (మంచి మెరుగైన తీరు)లోకి వచ్చింది. స్టూ డెంట్స్‌ అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాలు, ప్రతిభావంతమై న తరగతి బోధన, పా ఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్‌ బోధన, పాలనా ప్రక్రియల్లో మెరుగుపడి రిజల్ట్‌ వచ్చింది.

అంశం మొత్తం సాధించిన

మార్కులు మార్కులు

అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాలు 290 136

ప్రతిభావంతమైన తరగతి బోధన 90 64

మౌలిక వసతులు, విద్యార్థుల హక్కులు 51 42

పాఠశాల భద్రత, పిల్లల రక్షణ 35 27

డిజిటల్‌ విద్య 50 28

పాలనా ప్రక్రియలు 84 47

పీజీఐ నివేదిక వివరాలు

పీజీఐ – డీ సూచీని విడుదల చేసిన

కేంద్ర విద్యాశాఖ

రాష్ట్రస్థాయిలో జిల్లాకు మెరుగైన స్థానం

డిజిటల్‌ బోర్డుపై పాఠాల బోధన

28 శాతమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement