‘చంద్రబాబూ.. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?’ | YSRCP MLC Kalpalatha Reddy Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?’

Sep 27 2026 5:40 PM | Updated on Sep 27 2026 5:50 PM

YSRCP MLC Kalpalatha Reddy Slams Chandrababu Sarkar

తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. మహిళా ఉద్యోగులను కూడా రోడ్డు మీద  ఈడ్చెకెళ్లడం దుర్మార్గమన్నారు. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు కల్పలతారెడ్డి. 

‘వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థ అని కోపమా?, మహిళా ఉద్యోగులను కూడా రోడ్డు మీద పడేసి లాగడం దుర్మార్గం. తలలు పగిలే పోలీసులు కొట్టడం సిగ్గుచేటు. తిరుపతిలో కూడా ధర్నా చేస్తున్న నర్సింగ్ స్టూడెంట్స్‌ని జుట్టు పట్టుకుని లాగారు. 

ఉద్యోగులు న్యాయ బద్దమైన సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తే అరెస్టులు చేస్తారా?, ధర్నాకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ముందే చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా యూనియన్ నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. వారి హక్కుల గురించి అడిగితే అరెస్టులు చేయటం దుర్మార్గం. అరెస్టు అయిన వారందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: విజయవాడ ధర్నా చౌక్‌లో తీవ్ర ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement