వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ' ఆదర్శ కుటుంబం'. ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'నారాయణమ్మ' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి పాటను రాశారు. అయితే వెంకటేష్ ఎనర్జీతో కూడిన స్టెప్పులు, హాట్ బ్యూటీస్ డింపుల్ హయాతీ , నివేదా పేతురాజ్ గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ స్క్రీన్‌పై అదిరిపోయాయి.
ఇదీ చదవండి: ‘అన్నా.. అని పిలిచా కదరా.. చిన్న పిల్లాడ్ని చేసి ఇలా..
త్రివిక్రమ్ చేసిన కామెంట్స్
ఇది ఇలా ఉంటే డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘పాట షూటింగ్ టైంలో డింపుల్ ఆరోగ్యం బాగోలేదు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మాస్ బీట్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆమె ప్రదర్శించిన డెడికేషన్ నిజంగా అభినందనీయం. డింపుల్‌ని ఇలా పాటలో కాకుండా సినిమాలోనే కలవాలని కోరుకుంటున్నా’ అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు.
‘గల్ఫ్’ చిత్రంతో..
2017లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంతో వెండితెరకు పరిచమయ్యారు డింపుల్ హయాతీ. తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’లో “జర్ర జర్ర” పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాటకు ఆమె వేసిన ఊరమాస్ స్టెప్పులు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత విశాల్ సరసన ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడి’, గోపీచంద్‌తో ‘రామబాణం’ వంటి భారీ చిత్రాలతో కమర్షియల్ హీరోయిన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించిన ఆమె ఇప్పుడు త్రివిక్రమ్ మెచ్చిన నటిగా మారారు. ఇప్పుడు ‘నారాయణమ్మ’ పాటతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇదీ చదవండి: ‘అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్‌కి కాదు’.. స్లమ్‌డాగ్ గ్లింప్స్


