నవదీప్‌ రూ.100కోట్లకు అధిపతి: అజయ్‌ ఘోష్‌ | Actor Ajay Ghosh Reveals How Hero Navdeep Missed Out On Property Worth Hundreds Of Crores | Sakshi
Sakshi News home page

రామాపురం రిసార్ట్ నవదీప్‌ తండ్రిదే: అజయ్‌ ఘోష్‌

Oct 3 2026 4:57 PM | Updated on Oct 3 2026 5:23 PM

Actor Ajay Ghosh Reveals How Hero Navdeep Missed Out On Property Worth Hundreds Of Crores

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు అజయ్ ఘోష్ . ఇటీవల ఓ వేదికపై నటుడు నవదీప్‌ ఆస్తులు, వారి రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

‘నవదీప్ తండ్రి రామారావు 2002వ సంవత్సరంలోనే బాపట్ల జిల్లాలోని  చీరాల బీచ్ సమీపంలో ‘రామాపురం రిసార్ట్స్’ కట్టారు. ఆ కుటుంబం పూర్తిగా హైదరాబాద్‌కు తరలిరావాల్సి రావడంతో ఆ ప్రాపర్టీని అమ్మేశారు.  అలా అమ్మకుండా ఉండుంటే ఈరోజు రూ.100కోట్ల విలువ చేసేది. నవదీప్‌ అధిపతి అయ్యేవాడు. దాన్ని చూసినప్పుడల్లా ఇది నవదీప్‌ది కదా అని బాధపడుతుంటా’ అని వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం ఆ తీర ప్రాంతం పర్యాటకంగా భారీగా విస్తరించి ‘ఆంధ్రా గోవా’గా విశేష గుర్తింపు పొందింది.
Actor #Ajayghosh intersting words about Hero #Navadeep pic.twitter.com/PiipLJMD06

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement