విజయ్‌ను ఇమిటేట్‌ చేసిన రష్మిక.. ఈ క్యూట్‌ వీడియో చూశారా..? | Vijay Deverakonda Rashmika Magic off Screen Ranabaali Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ను ఇమిటేట్‌ చేసిన రష్మిక.. ఈ క్యూట్‌ వీడియో చూశారా..?

Oct 3 2026 6:21 PM | Updated on Oct 3 2026 6:30 PM

Vijay Deverakonda Rashmika Magic off Screen Ranabaali Movie

విజయ్‌ దేవరకొండ రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. అక్టోబరు 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ మేకింగ్‌ వెనుక విశేషాలను చిత్ర బృందం పంచుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాలో విజయ్‌ చెప్పిన ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ డైలాగ్‌ను రష్మిక రీ-క్రియేట్‌ చేసిన వీడియో విడుదల చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే  డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్‌, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు.అజయ్‌, అతుల్‌ సంగీతం అందించారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. 
ఇదీ చదవండి: రష్మిక వంట చేస్తే.. ఓ యుద్ధం చేసినట్లే: విజయ్‌ దేవరకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement