breaking news
Anumol
-
PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్)ను సెట్ చేసుకుని వస్తారు. అందుకోసం వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఖర్చు పెడతారు. అంత స్థోమత లేని వారు హౌస్‌లో ఉన్నన్నాళ్లుండి ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవలే మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్లో నటి అనుమోల్ విజేతగా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ.42.5 లక్షలు, ఒక ఎస్యూవీ కారును గెల్చుకుంది.పీఆర్ కోసం రూ.16 లక్షలుకామన్ మ్యాన్ అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక ఇదే సీజన్లో పాల్గొన్న బిన్నీ సెబాస్టియన్ అనే కంటెస్టెంట్.. అనుమోల్ (Anumol) పెద్ద పీఆర్‌ను పెట్టుకుందని, అందుకోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిగ్‌బాస్ హౌస్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో ఆమె పీఆర్ వల్లే గెలిచిందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై అనుమోల్ స్పందించింది. నేను రూ.16 లక్షలు పెట్టి పీఆర్‌ను సెట్ చేసుకోవడం వల్లే టైటిల్ గెలిచానంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు.అంత డబ్బు నాకెక్కడిది?అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారని నాతో చెప్పారు. అందుకే నేను కూడా ఓ వ్యక్తిని కలిశాను. అతడు రూ.15 లక్షలు అడిగాడు. అంత స్థోమత నాకు లేదని చెప్పాను. కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇస్తానన్నాను. రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. షో అయిపోయాక మిగతా సగం ఇస్తానన్నాను. ఈ రూ.16 లక్షల స్టోరీ ఎవరు అల్లారో నాకు అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే ఈ షోకి వచ్చేదాన్ని కాదు అని క్లారిటీ ఇచ్చింది.ఇక్కడా అదే రిపీట్?మలయాళ బిగ్‌బాస్ 7లో సెలబ్రిటీ విన్నర్ అయితే కామనర్ రన్నరప్ అయ్యాడు. దీంతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోనూ ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనూజకు కప్పిచ్చేస్తారని, కల్యాణ్ రన్నరప్‌గా ఉంటాడని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. పైగా పీఆర్ కోసం వాళ్లే అంత ఖర్చుపెడ్తే తెలుగు కంటెస్టెంట్లు ఇంకే రేంజులో ఖర్చు పెడుతున్నారో? అని గుసగుసలాడుతున్నారు. మరి ఫైనల్లో ఇదే జరుగుతుందా? లేదంటే కామనర్ విన్నింగ్ రేసులోకి వస్తాడా? చూడాలి!చదవండి: రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ వార్నింగ్ -
బిగ్‌బాస్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సీజన్ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతోంది. ఈ రియాలిటీ షోకు ఆడియన్స్‌ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మలయాళ బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఈ సీజన్ విజేతగా ప్రముఖ మలయాళ నటి, యాంకర్ అనుమోల్ నిలిచింది.మలయాళ బిగ్‌బాస్ హిస్టరీలో రెండోసారి మహిళ కంటెస్టెంట్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్రోఫీని అందించారు. అయితే ఈ సీజన్లో మొదటిసారి కామనర్‌గా అడుగుపెట్టిన అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సీజన్‌కు విజేతకు ట్రోఫీతో పాటు రూ.42.55 లక్షల నగదు, లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సీజన్లో షానవాస్, అక్బర్, నెవిన్, అనుమోల్, అనీష్ టాప్-5లో నిలిచారు. చివరికీ నటి అనుమోల్ విన్నర్‌గా అవతరించింది. కాగా.. ఈ సీజన్‌కు మలయాళ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. -
స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!
ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు మోహన్. 16 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం హరా. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విజయ్శ్రీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కోయంబత్తూర్ ఎస్పీ.మోహన్ రాజ్‌తో కలిసి జీ.మీడియా పతాకంపై జయశ్రీ విజయ్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. అయితే మధ్యలో దర్శకుడు విజయ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా హరా చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమై ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటి కథానాయకిగా నటించాల్సి ఉండగా కాల్షీట్స్ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లో అయాలి నటి అనుమోల్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఆమె అయాలి వెబ్ సిరీస్‌లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ఆయన 68వ చిత్రంలోనూ అనుమోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. కాగా.. హరా చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్, అనిత నాయర్, చారుహాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియాండర్ లీ మార్టీ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
అది నాకు తెలిసిన జీవితం!: హీరోయిన్ అనుమోల్
తమిళసినిమా: మలయాళంలో విభిన్న పాత్రలను పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటి అనుమోల్. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. కథానాయకి పాత్రల్లోనే నటిస్తానని బెట్టు చేయకుండా నచ్చిన, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు తమిళంలో ఒరు ఇరవిల్ చిత్రంలో నటించిన అనుమోల్ ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణను పొందుతున్న అయిలీ వెబ్ సిరీస్‌లో అమ్మగా ముఖ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ బహుభాషా నటిని పలకరించగా అయిలీ చిత్రం ఇంత మంచి విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఇందులో పాత్ర గురించి దర్శకుడు ముత్తుకుమార్ చెప్పినప్పుడు దీన్ని వదులుకోరాదని భావించానన్నారు. ఎందుకంటే ఆ పాత్ర తనకు తెలిసిన జీవితం అన్నారు. తన తల్లికి తనకు మధ్య జరిగినదేనని చెప్పారు. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అని అభిప్రాయపడ్డారు. ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న ప్రశంసలు యూనిట్ అందరికీ చెందుతాయన్నారు. తమిళంలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం మంచి అవకాశాలు రాకపోవడమేననీ, ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయనీ చెప్పారు. నిజం చెప్పాలంటే తన సినీ పయనం తమిళ చిత్ర పరిశ్రమ నుంచే ప్రారంభం అయ్యిందని చెప్పారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ తమిళ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యిందన్నారు. తమిళంలో అందరి దర్శకుల చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటన్నానన్నారు. అదే విధంగా ఇటీవల సూర్య నటించిన జైభీమ్ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అయిలీ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోందని, దీంతో అక్కడ కూడా అవకాశాలు వస్తాయని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం మలయళంలో తాను నటించిన థా ధవలయుడే థా, పెండులం, తమిళంలో ఫర్హానా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోందన్నారు. మరి కొన్ని నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్నాయన్నారు. -
మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ
కోలీవుడ్‌కు మాలీవుడ్ నాయకిల దిగుమతి కొనసాగుతోంది. ఆసిన్, నయనతారల నుంచి ఈ తరం లక్ష్మీమీనన్‌ల వరకు కోలీవుడ్‌లో జయించిన మలయాళీ భామలే. ఈ వరసలో తాజాగా అనుమోల్ చేరనుంది. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళంలో మంచి నటిగా ప్రకాశిస్తోంది. కాగా పరిశ్రమలో సినీ ఎడిటర్లు దర్శకులైన సంఘటనలు అరుదు. అయితే దర్శకత్వానికి ఎడిటింగ్‌కు చాలా అనుబంధం ఉంటుంది. చిత్రీకరణలో దర్శకుడు ఆశించిన అవుట్‌పుట్ రాకపోయినా ఎడిటింగ్‌లో సాధ్యమైనంత వరకు తన భావాలకనుగుణంగా మలచుకోవచ్చు. ఎడిటింగ్‌లో అంత విషయం ఉందన్నమాట. ఎడిటింగ్‌లో నేర్పరి అయితే దర్శకత్వంలో సులభంగా రాణించవచ్చు. అలాంటి ధైర్యంతోనే ఏమో యువ ఎడిటర్ ఆంటోని మెగాఫోన్ పట్టడానికి సాహసిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఈయన మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ చిత్ర తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక వేశ్య ఇతివృత్తంతో కూడిన చిత్రం. మలయాళంలో ఈ పాత్రను సజిత మరత్తిల్ పోషించారు. కేరళ ప్రభుత్వ అవార్డును పొందిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో మలయాళకుట్టి అనుమోల్ నటించడానికి సిద్ధం అవుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. దర్శకుడు విజయ్ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.


