స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి! | Anumol replaces Khushboo as leading lady in Haraa | Sakshi
Sakshi News home page

Anumol: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!

Nov 4 2023 7:19 AM | Updated on Nov 4 2023 8:34 AM

Anumol Acts As Heroine In Haraa Replaced BY Khushboo starring Mohan Film - Sakshi

ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు మోహన్‌. 16 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం హరా. ఇంతకుముందు దాదా 87, పౌడర్‌ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విజయ్‌శ్రీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కోయంబత్తూర్‌ ఎస్‌పీ.మోహన్‌ రాజ్‌తో కలిసి జీ.మీడియా పతాకంపై జయశ్రీ విజయ్‌ నిర్మిస్తున్నారు. ఇంతకుముందే చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాగా.. అయితే మధ్యలో దర్శకుడు విజయ్‌ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్‌ వాయిదా పడింది. 

తాజాగా హరా చిత్రం షూటింగ్‌ మళ్లీ ప్రారంభమై ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటి కథానాయకిగా నటించాల్సి ఉండగా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లో అయాలి నటి అనుమోల్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఆమె అయాలి వెబ్‌ సిరీస్‌లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న ఆయన 68వ చిత్రంలోనూ అనుమోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు.

కాగా.. హరా చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో యోగిబాబు, మొట్టై రాజేంద్రన్‌, సింగం పులి, దీప, మైమ్‌ గోపి, శ్యామ్స్‌, కౌశిక్‌, అనిత నాయర్‌, చారుహాసన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి లియాండర్‌ లీ మార్టీ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement