బిగ్‌బాస్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలో తెలుసా? | Famous Tv Actress won the Bigg Boss Title prize money goes viral | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలో తెలుసా?

Nov 10 2025 5:05 PM | Updated on Nov 10 2025 5:53 PM

Famous Tv Actress won the Bigg Boss Title prize money goes viral

ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సీజన్‌ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతోంది. ఈ రియాలిటీ షోకు ఆడియన్స్‌ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మలయాళ బిగ్‌బాస్‌ సీజన్-7 ‍గ్రాండ్‌ ఫినాలే ముగిసింది. ఈ సీజన్‌ విజేతగా ప్రముఖ మలయాళ నటి, యాంకర్‌ అనుమోల్ నిలిచింది.

మలయాళ బిగ్‌బాస్ హిస్టరీలో రెండోసారి మహిళ కంటెస్టెంట్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతకు మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌ ట్రోఫీని అందించారు. అయితే ఈ సీజన్‌లో మొదటిసారి కామనర్‌గా అడుగుపెట్టిన  అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సీజన్‌కు విజేతకు ట్రోఫీతో పాటు రూ.42.55 లక్షల నగదు, లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సీజన్‌లో  షానవాస్, అక్బర్, నెవిన్, అనుమోల్, అనీష్ టాప్‌-5లో నిలిచారు. చివరికీ నటి అనుమోల్‌ విన్నర్‌గా అవతరించింది. కాగా.. ఈ సీజన్‌కు మలయాళ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement