చాలాకాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. శివ నిర్వాణ దర్శకత్వం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రవితేజ, బేబీ నక్షత్రల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ తన కథ, కథనంతో అందరినీ ఎమోషనల్ గురి చేశాడని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ రోజే ఈ చిత్రంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని.. ఇరుముడి తన మనసుని ఎంతగానో హత్తుకుందని ట్వీట్ చేసింది.
(చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
‘నిన్న నాకు ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. అసలు ఎంత మంచి సినిమానో ఇది. ఊహించని విధంగా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు... ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది.
(చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్)
రవితేజ సర్, మీకు అభినందనలు.. ఈ విజయం సాధించినందుకు మీ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నక్షత్రకు నా అభినందనలు.. సినిమాలో నువ్వు సూర్యకాంతిలా మెరిసావు, నీ నవ్వు నా పెదవులపై చిరునవ్వు నింపింది.. శివ నిర్వాణ గారికి శుభాకాంక్షలు.. మీరు ఈ విజయానికి అన్ని విధాలా అర్హులు.. మీ గురించి చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి అభినందనలు. ఇంతటి సుందరమైన చిత్రాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని రష్మిక ట్వీట్ చేసింది.
Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️
What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️
Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026


