బ్రహ్మాస్త్ర-2లో రణ్‌బీర్‌కు జోడిగా యంగ్‌ హీరోయిన్‌ | Aneet Padda Approached For Role Opposite Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

బ్రహ్మాస్త్ర-2లో రణ్‌బీర్‌కు జోడిగా యంగ్‌ హీరోయిన్‌

Aug 25 2026 2:11 PM | Updated on Aug 25 2026 2:23 PM

Aneet Padda Approached For Role Opposite Ranbir Kapoor

2022లో విడుదలైన  ‘బ్రహ్మాస్త్ర’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర-2’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు కనిపించనున్నారు. తొలి పార్ట్‌లో పలు ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో రెండో పార్ట్‌కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చేతిలో ఓ చిన్నారిని పట్టుకుని..
ముఖ్యంగా తొలిభాగం పోస్ట్‌ క్రెడిట్‌ సన్నివేశంలో దీపికా పదుకొణే పాత్రను పోలిన ఓ మహిళను చూపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ముఖాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో ఓ చిన్నారిని పట్టుకుని కనిపించడంతో.. రెండో భాగంలో ఆమె పాత్ర కీలకంగా ఉండొచ్చనే ఊహాగానాలు వచ్చాయి.
యువనటి పేరు వైరల్‌..
ఇదిలా ఉండగా.. తాజాగా ‘సయ్యారా’ చిత్రంలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటి అనీత్‌ పడ్డా.   ఈ పేరు ‘బ్రహ్మస్త్ర2’ కోసం వినిపిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా కీలక పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే చిత్రం బృందం ఆమెను సంప్రదించినట్లు టాక్‌. అయితే ఈ ఎంపిక అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. అనిత్‌ పడ్డా సినిమాలో భాగమైతే ఓ యువనటిని ఈ భారీ ఫ్రాంచైజీలో చూడటం ఆసక్తికరంగా మారనుంది. 

ఇదీ చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్‌.. స్వామి గెటప్‌లో వార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement