‘టాక్సిక్‌’ కోసం యశ్‌ ఎంత తీసుకున్నాడు? హీరోయిన్లకూ ఎక్కువే! | Toxic Movie: Yash Salary, Budget and Kiara Advani, Nayanthara Remuneration | Sakshi
Sakshi News home page

‘టాక్సిక్‌’ కోసం యశ్‌ ఎంత తీసుకున్నాడు? హీరోయిన్లకూ ఎక్కువే!

Aug 25 2026 12:58 PM | Updated on Aug 25 2026 1:06 PM

Yash Charge Huge Remuneration For Toxic Movie

కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకొని ‘టాక్సిక్‌’తో రేపు(ఆగస్ట్‌ 26) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాకింగ్‌ స్టార్‌ యశ్‌. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే మాఫియా ప్రపంచాన్ని ఇందులో చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

యశ్‌ 'రాయ' అనే పవర్‌ఫుల్‌ మాఫియా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే అందులో యశ్‌ పారితోషికం కూడా భారీగానే ఉందని ఇండస్ట్రీ టాక్‌. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లను తీసుకున్నాడట. 

అంతేకాదు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లాభాల్లోనూ యశ్‌కి వాటా రాబోతుంది. ఇలా నిర్మాతగా, నటుడిగా మొత్తంగా రూ. 100-120 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. యశ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు కూడా భారీగా రెమ్యునరేషన్‌ ఇచ్చారట. కియారా అద్వానీ రూ. 15 కోట్లు, నయనతార రూ. 15-18 కోట్లు, హ్యూమా ఖురేషి రూ. 2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్‌ రుక్ష్మిణి వసంత్‌ కూడా రూ. 3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement