కియారా నువ్వు చాలా లక్కీ.. ఆ సినిమా చేయలేదు | Vignesh Shivan Reacts Kiara Advani Not Doing LIK Movie | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: తన సినిమాపైనే ట్రోలింగ్ చేసుకున్న దర్శకుడు

Aug 25 2026 10:47 AM | Updated on Aug 25 2026 11:27 AM

Vignesh Shivan Reacts Kiara Advani Not Doing LIK Movie

కొందరు హీరోయిన్లకు దక్షిణాది సినిమాలు తెగ కలిసొస్తాయి. కొందరికి మాత్రం అస్సలు కలిసిరావు. అలాంటి వాళ్లలో హీరోయిన్ కియారా అడ్వాణీ ఒకరు. ఇప్పటివరకు హిందీలో చాలానే మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. 'భరత్ అనే నేను'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్‌తో చేసిన ఈ సినిమా హిట్టయినా తర్వాత చేసిన వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ ఘోరమైన ఫ్లాప్స్ అ‍య్యాయి. ఈమె మరో సౌత్ మూవీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. స్వయంగా డైరెక్టరే ఈ విషయాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

కియారా ఓ హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. కన్నడ ఇండస్ట్రీకి చెందిన యష్ హీరోగా నటించాడు. సోమవారం దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విఘ్నేశ్ శివన్.. తను రీసెంట్‌గా తీసిన సినిమాపై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు. కియారా అందులో నటించకపోవడం ఆమె అదృష్టమని చెప్పుకొచ్చాడు.

'కియారా.. నువ్వు కబీర్ సింగ్('అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్) సినిమా చేయడానికి ముందు నేను నీకో స్క్రిప్ట్ చెప్పాను. దాన్ని నేను సినిమాగా తీశా. అదే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే ఆ మూవీలో నటించలేదు' అని విఘ్నేశ్ అనేసరికి ఎదురుగా కూర్చున్న కియారా కూడా నవ్వేసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి చేసింది. ప్రదీప్ రంగనాథన్ హీరో. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అలా కియారా ఈ ఫ్లాప్ మిస్ అయింది.

(ఇదీ చదవండి: 'ఇరుముడి'లో ఆ సీన్స్ తొలగించాలి: ఏపీ టీచర్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement