మేం చేసిందేం లేదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: యశ్ | KGF Actor Yash Gives Powerful Message About Success Failure And Respect At Toxic Movie Event | Sakshi
Sakshi News home page

Toxic Movie: మేం చేసిందేం లేదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: యశ్

Aug 23 2026 6:46 AM | Updated on Aug 23 2026 10:49 AM

KGF Hero Yash Comments At Toxic Movie Pre Release Event

కేజీఎఫ్ హీరో నటించిన లేటేస్ట్ యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, కేవీఎన్‌ ప్రోడక్షన్స్ పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 26న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, విద్యార్థులను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. మేము సినిమాలను ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఇందులో పెద్దగా మేం చేసింది ఏం లేదన్నారు. మీ కలల కోసం మీరు కష్టపడండి.. అప్పుడే మీకు ఈ సమాజంలో సక్సెస్‌తో పాటు రెస్పెక్ట్ దొరుకుతుందన్నారు.

మనం ఫెయిల్ అయితే ఈ ప్రపంచాన్ని నిందించాల్సిన అవసరం లేదు.. దానికి మనమే బాధ్యులమని యశ్ అన్నారు. మనదేశంలో ఎన్నో రాష్ట్రాలు, భాషలు ఉన్నాయి.. మన భాషలతో కొందరు పాలిటిక్స్ చేస్తారని తెలిపారు. నార్త్, సౌత్ అనే తేడా మనకు వద్దని.. మన పని చూస్తే ఎక్కడికెళ్లినా అదే గౌరవం దక్కుతుందని యశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement