‘రాక్షసుడు, ఖిలాడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘మహావీర్ కర్ణ’. జయంతీ లాల్ గడా సమర్పణలో ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రోడక్షన్స్, ఆర్.వి స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. భారతీయ ఇతిహాసం మహాభారతంలోని ప్రధానపాత్రల్లో ఒకటైన కర్ణుడి ఆధారంగా ఈ ‘మహావీర్ కర్ణ’ సినిమా రూ పొందుతోంది.
పెనుమేస్త ధనుంజయ్ వర్మ, రోషన్, చైతన్య రావు, మురళీ కృష్ణ, సుమతి, ఆరాధ్య, ముఖేష్ ఈ సినిమాలోని ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ‘కర్ణా... నీవుపాండవుల పక్షాన నిలబడితే సకల ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఈ లోకం నిన్ను కొలుస్తుంది’, ‘ఈ లోకం మరువనిది పోగొట్టుకున్న రాజ్యాలను, సంపదను కాదు... ఇచ్చిన మాటను, ఈ కర్ణుడికి మాటే ప్రాణం...’ అన్న డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి.
‘‘ఈ చిత్రాన్ని రమేష్ వర్మ ఓ వినూత్నమైన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ ఫార్మాట్‌లో రూ పొందిస్తున్నారు. లైవ్ పెర్ఫార్మెన్స్‌లోని భావోద్వేగ బలాన్ని, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ను కలిపి ఈ చిత్రాన్ని సరికొత్త అనుభూతిని అందించేలా రూ పొందిస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది.


