టాక్సిక్‌ గొప్ప అనుభూతి ఇస్తుంది: యశ్‌ | Actor Yash Made Interesting Comments About Toxic Movie At Pre-Release Event, Deets Inside | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ గొప్ప అనుభూతి ఇస్తుంది: యశ్‌

Aug 23 2026 6:22 AM | Updated on Aug 23 2026 10:39 AM

Yash about Toxic movie: Toxic Pre-Release Event

‘దిల్‌’ రాజు, వెంకట్‌ కె.నారాయణ, హ్యూమ, యశ్, కియార, రుక్మిణి

‘‘టాక్సిక్‌’ సినిమా కోసం ఇండియాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసి, తమ బెస్ట్‌ ఇచ్చారు. ఈ మూవీ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటుంది.  పాత్‌ బ్రేకింగ్‌ మూవీ అవుతుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇస్తుంది’’ అని హీరో యశ్‌ తెలిపారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ హీరోయిన్లు. మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, కేవీఎన్‌ ప్రోడక్షన్స్ పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు.

 శనివారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ‘టాక్సిక్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యశ్‌ మాట్లాడుతూ–‘‘కేజీఎఫ్‌’ మూవీ తర్వాత ఒక థ్యాంక్స్‌ చెప్పడానికి కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. పనిలో లీనం కావడం వల్లే రాలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్‌. ఎవరైనా కూడా నిజాయతీ, ప్యాషన్‌తో పని చేస్తే ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారనే నమ్మకం ఇచ్చారు. తెలుగు సినిమాని మేము ప్రేమిస్తాం.. కన్నడ సినిమాలను మీరు కూడా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మనందరిదీ భారతీయ సినిమా. 

త్వరలోనే మేమంతా భారతీయ సినిమాని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లాలి. ‘దిల్‌’ రాజుగారు ప్యాషనేట్‌ ప్రోడ్యూసర్‌. ఆయనకి  ‘దిల్‌’ రాజు అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా దిల్‌ ఉంది. కేవీఎన్‌గారు డబ్బు సంపాదించడానికి ఇండస్ట్రీకి రాలేదు. తన ప్యాషన్‌ని ఇండియన్‌ ఇండస్ట్రీకి అందించడానికి వచ్చారు’’ అని చెప్పారు. 

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘భారతీయ సినిమాని ప్రపంచ సినిమాగా మారుస్తున్నందుకు యశ్, రాజమౌళిగార్లకు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. మా బ్యానర్‌లో యశ్‌గారు సినిమా ఖరారు చేశారు. ఆయన పిలుపు కోసం నేను వేచి చూస్తున్నాను’’ అని తెలిపారు. 

వెంకట్‌ కె.నారాయణ మాట్లాడుతూ–‘‘మా సినిమా జనాలకు చేరువ కావడానికి ‘దిల్‌’రాజుగారి ద్వారా మాకు సరైన దారి దొరికింది. ‘టాక్సిక్‌’ మూవీ ప్రేక్షకుల పల్స్‌ రేట్‌ని మార్చుతుంది’’ అని చెప్పారు.
ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కోడలు ప్రీతి రెడ్డి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకులు రవి బస్రూర్, విశాల్‌ మిశ్రా, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు సుదేవ్, అక్షయ్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement