టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ విలన్‌గా? | Regina Cassandra To Play A Powerful Villain Role In Nayanthara Mookuthi Amman 2, Deets Inside | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ విలన్‌గా?

Aug 23 2026 6:30 AM | Updated on Aug 23 2026 10:44 AM

Regina Cassandra Antagonist Role In Mookuthi Amman 2

విలన్‌ పాత్ర బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్‌ అవుతుందని అంటారు. అదే విధంగా హీరోయిన్‌గా కంటే విలన్ పాత్రలు చేసేందుకు చాలా తక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇమేజ్‌ పోతుందనే భయంతో స్టార్ హీరోయిన్లు ఇలాంటివి చేసేందుకు అంగీకరించరు. టాలీవుడ్ బ్యూటీ రెజీనా మాత్రం ఇప్పటికే ఎవరు, విడామయూర్చి తదితర చిత్రాల్లో విలనిజం చూపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమైంది.

తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రెజీనా.. నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న 'మూకుత్తి అమ్మన్‌ 2' చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. 2020లో విడుదలైన తొలి భాగం హిట్ అయింది. దానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా , సీక్వెల్‌కు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతారతో పాటు ఊర్వశి, స్నేహా, యోగిబాబు, దునియా విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఇందులోనే విలన్‌గా రెజీనా పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, గెటప్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. కాగా మడోన్నా అశ్విన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా చేస్తున్న చిత్రంలోనూ రెజీనా కీలక పాత్ర చేస్తుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement