Love Insurance Kompany
-
పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు
హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గతవారం థియేటర్లలోకి వచ్చింది. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత నష్టాలొస్తాయో చూడాలి? అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం గురించి విఘ్నేశ్ శివన్ ఇన్నాళ్లకు స్పందించాడు. అసలేం జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)తొలుత ఈ సినిమాకు 'LIC' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. LIC సంస్థ ఈ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని చెప్పడంతో టీమ్ మెట్టు దిగింది. టైటిల్లోని C బదులు K అనే అక్షరాన్ని జోడించారు. అలానే థియేటర్లలో రిలీజైంది.అయితే LIC అనే పేరు ఉపయోగించుకోవాలంటే తమకు రూ.112 కోట్లు ఇవ్వాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా విఘ్నేశ్ శివన్ బయటపెట్టాడు. ఇన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని బదులుగా తను LIP, LIT, LIK, LIF టైటిల్స్ ఆలోచించి పెట్టుకున్నానని.. చివరగా LIK టైటిల్ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విషయానికొస్తే.. 2040లో జరిగే ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఫోన్లోని యాప్ చెబితేనే ప్రేమిస్తాననుకునే అమ్మాయి.. లేదంటే ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలనుకునే అబ్బాయి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది? చివరకు వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలానే హీరో ప్రదీప్ రంగనాథన్.. హ్యాట్రిక్స్ హిట్స్‌కి కూడా ఈ చిత్రంలోనే బ్రేక్ పడింది.(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)#VigneshShivan about LIK Title- We initially titled #LIK as “LIC” (Love Insurance Company), but LIC demanded ₹112 crores for us to use the name.- Since that wasn’t feasible, I explored alternative options like LIP, LIT, LIK, and LIF.pic.twitter.com/TfjB0D9qlH— Movie Tamil (@_MovieTamil) April 14, 2026 -
నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్ ఏంటి?
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా.. తెరపై ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.కథ విషయానికొస్తే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్, సోషల్ మీడియా ప్రభావం మన జీవితాలపై ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. #LIK (Tamil) {2.25/5} - Lyt Idi Kuda.#LoveInsuranceKompany #LIKReview #CMReviews pic.twitter.com/qi58kxTikQ— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 10, 2026#LIK - 2/5Movie has a unique futuristic concept, but the story is weak and not very engaging. PR gives a good performance and tries hard to carry the film with his energy. Some scenes and comedy work, but the slow narration and uneven screenplay make it boring at times.…— Raghavendra (@SRaghavendra87) April 10, 2026 -
నాకు లక్ లేదనడం బాధగా ఉంది: హీరోయిన్ కృతీ శెట్టి
‘‘ఓ నటిగా నేను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్ని సినిమాలకు సరైన బాక్సాఫీస్ ఫలితాలు రాలేదు. దీంతో నా హార్డ్‌వర్క్ గురించి కాకుండా నాకు లక్ లేదని కామెంట్ చేస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. సినిమా రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు. కానీ అలాంటి కామెంట్స్ వల్ల ఒక అవకాశం మిస్ కావడమనేది బాధగా ఉంటుంది. ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా రిలీజవుతోంది.‘ఈ సినిమాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి డౌట్‌గా ఉంది’ (సినిమా రిజల్ట్‌ను ఉద్దేశించి) అని కామెంట్ చేస్తున్నారు. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకోవడం నాకు బాధగా ఉంది. కానీ ఎప్పటిలానే ప్రతి సినిమాకీ నా వంతు కృషి చేస్తాను’’ అని చెప్పారు కృతీ శెట్టి. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.⇒ ఈ చిత్రంలో నేను ధీమా అనే పాత్ర పోషించాను. తనకు నోమోఫోబియా. అంటే ధీమా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఆమెకు భయం వేస్తుంది. సోషల్ మీడియాకి బానిస అయిన అమ్మాయి. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో నయనతారగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఓ ప్రాబ్లమ్ వచ్చి, నయనతారగారికి ఫోన్ చేయగా, ఆమె మంచి సలహా ఇచ్చారు... చక్కగా గైడ్ చేశారు. ⇒ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కథ 2040లో జరిగినా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే... ఇప్పుడు కూడా అందరూ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాను ఎక్కువగానే వినియోగిస్తున్నారు. నెగటివ్ ట్రోల్స్ చేసేవారు నెగటివ్‌గా థింక్ చేస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి వాళ్ల జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్నీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ఏమో... భవిష్యత్‌లో లవ్‌ను ఇన్సూరెన్స్ చేసే చాన్స్ ఉంటే, అలా చేస్తారేమో. నాకైతే పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే ఉంది. ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో... ఒక వ్యక్తితో డేటింగ్ చేసి, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడిగారితో సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా అంగీకరించాను. హిందీలో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.. -
నయనతార సడన్ సర్ప్రైజ్.. స్టేజ్‌పై భర్త ఎమోషనల్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్‌పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసింది. ప్రమోషనల్ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్‌మీట్‌లోనూ పాల్గొని సందడి చేసింది.సర్ప్రైజ్తాజాగా మరోసారి ప్రమోషన్స్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మంగళవారం (ఏప్రిల్ 7న) గ్రాండ్‌గా జరిగింది. విఘ్నేశ్ మాట్లాడుతున్న సమయంలో నయన్ సడన్‌గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. వీడియో వైరల్భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్‌లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కోసమే నయన్ ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ఐకే (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్‌టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
ఓ సారి బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: ఉప్పెన బ్యూటీ
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.ఎల్ఐకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. #PradeepRanganathan - I prefer to say I’m single. I’ve gone through many break-ups💔. I have not blocked anyone, but people have blocked me, and I used to reply faster than even ChatGPT during my college days itself😂#KrithiShetty - I’m single & I’ve gone through 1 break-up. My… pic.twitter.com/IUiPpHhx8A— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
'Love Insurance Kompany' ప్రీ-రిలీజ్ వేడుకలో అనిల్ రావిపూడి స్పీచ్
-
గ్రాండ్‌గా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది: ‘దిల్’ రాజు
‘‘ఒక అప్లికేషన్ (యాప్) బ్యాక్‌డ్రాప్‌తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా తీశారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రదీప్ హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు వెర్షన్ చూశాను... చాలా ఎంజాయ్ చేశాను. 2040లో మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడతామో ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు’’ అని చెప్పారు. ‘‘మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం... ఇలా అన్నింటికీ ఫోన్ పైనే ఆధారపడుతున్నాం.మనుషుల కంటే మిషన్స్‌పైనే నమ్మకం పెరుగుతోంది. మిషనే పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దాన్ని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్. ‘‘ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న ధీమా పాత్ర చేశాను’’ అన్నారు కృతీ శెట్టి. ‘‘మంచి కాన్సెప్ట్‌తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ఇది’’ అన్నారు విఘ్నేష్ శివన్. డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్, నిర్మాత హరిప్రసాద్ పాల్గొన్నారు. -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్‌తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్‌ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్‌తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్‌లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్‌తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.అసలేంటి వివాదం?విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్‌ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్‌తో వివాదం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి) -
యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్
డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)ట్రైలర్ బట్టి చూస్తే సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్‌ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్‌లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్‌ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్‌తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఏడాదిగా ట్రెండింగ్‌లో తమిళ్ సాంగ్.. తెలుగు వర్షన్ రిలీజ్
గత ఏడాదిగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఓ పాట తెగ వైరలయింది. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలోని ధీమా పాట. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ విఘ్నేశ్యే ఈ ధీమా పాటకు సైతం లిరిక్స్ అందించాడు. అనిరుధ్ తన గాత్రంతో దాన్ని మరింత అందంగా ఆలపించాడు. 'ధీమా' తెలుగు సాంగ్ రిలీజ్ఈ పాట రిలీజ్ చేసినప్పటినుంచి చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్ వదిలారు. హృదయపు కోటే.. దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే.. అంటూ పాట మొదలవుతుంది. ఇది చూసిన అభిమానులు.. లేటుగానైనా సరే తెలుగులో రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పాటను మీరూ వినేయండి..సినిమాలవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ నయనతార నిర్మిస్తోంది. ఇందులో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్, మాళవిక కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. #Dheema Telugu version is out now :) #LIK from April 10 ❤️ https://t.co/KQQII9rAK7 pic.twitter.com/NwF5w1LUrP— Anirudh Ravichander (@anirudhofficial) April 2, 2026 -
ఉప్పెన బ్యూటీ ఎల్ఐకే.. తెలుగు టీజర్ రిలీజ్
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, ప్రదీప్ రంగనాథన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ఎల్ఐకే((లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. గతేడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీని సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ టీజర్ చూస్తుంటే ప్రేమకథగానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం.. కానీ ఒకడు లేని విషయాన్ని ఉందనే అంటున్నాడు' అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రేమ, ప్రపోజల్స్ ఎలా ఉంటాయనే కాన్పెప్ట్‌తో రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.Best wishes to @pradeeponelife #VigneshShivan @anirudhofficial and the entire team for the Telugu release ♥️#LIK teaser out now:https://t.co/iluBWidtN1#LIKFromApril10 #LoveInsuranceKompanyAn @anirudhofficial musical 🎵 A #Wikki original @7screenstudio @IamKrithiShetty… pic.twitter.com/4I0OkfgFof— Rana Daggubati (@RanaDaggubati) April 1, 2026 -
రోబోగా అనిరుధ్.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గ్లింప్స్
తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నయనతార నిర్మిస్తుండగా ఈమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. టైటిల్ విషయమై అప్పట్లో కాస్త కాంట్రవర్సీ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ పంచ్ పేరుతో ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటూనే ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)2040లో చెన్నైలో జరిగే స్టోరీతో ఈ సినిమా తీశారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమైపోయింది. ఎస్జే సూర్య విలన్. సంగీతమందించిన అనిరుధ్.. ఇదే మూవీలో కనిపించిన రోబోకు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలానే సినిమాలో యష్.. మిషన్ ఇంపాజిబుల్-14లో నటించాడని, రజినీకాంత్ 189 కూడా చేస్తున్నాడని లాంటి రిఫరెన్సులు ఉన్నాయి. అలానే కొండపై హాలీవుడ్ అక్షరాలు ఉన్నట్లు ఇక్కడ కోలీవుడ్ అని ఉండటం లాంటివి డిఫరెంట్‌గా అనిపించాయి.2040లో స్వచ్ఛమైన ప్రేమని వెతికే ఓ అమ్మాయి.. హీరోని కలిస్తే తర్వాత ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు ఉంది. ఇందులో ఎస్జే సూర్య గెటప్ కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ప్రస్తుతానికి తమిళ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా తీసుకొస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో)


