పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు | Director Vignesh Shivan About LIC Title Changed To LIK | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని టైటిల్ మార్చేశా

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:58 AM

Director Vignesh Shivan About LIC Title Changed To LIK

హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గతవారం థియేటర్లలోకి వచ్చింది. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత నష్టాలొస్తాయో చూడాలి? అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం గురించి విఘ్నేశ్ శివన్ ఇన్నాళ్లకు స్పందించాడు. అసలేం జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

తొలుత ఈ సినిమాకు 'LIC' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. LIC సంస్థ ఈ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని చెప్పడంతో టీమ్ మెట్టు దిగింది. టైటిల్‌లోని C బదులు K అనే అక్షరాన్ని జోడించారు. అలానే థియేటర్లలో రిలీజైంది.

‍అయితే LIC అనే పేరు ఉపయోగించుకోవాలంటే తమకు రూ.112 కోట్లు ఇవ్వాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా విఘ్నేశ్ శివన్ బయటపెట్టాడు. ఇన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని బదులుగా తను LIP, LIT, LIK, LIF  టైటిల్స్ ఆలోచించి పెట్టుకున్నానని.. చివరగా LIK టైటిల్ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విషయానికొస్తే.. 2040లో జరిగే ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఫోన్‌లోని యాప్ చెబితేనే ప్రేమిస్తాననుకునే అమ్మాయి.. లేదంటే ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలనుకునే అబ్బాయి మధ్య ఎలాంటి సంఘర్షణ  జరిగింది? చివరకు వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలానే హీరో ప్రదీప్ రంగనాథన్.. హ్యాట్రిక్స్ హిట్స్‌కి కూడా ఈ చిత్రంలోనే బ్రేక్ పడింది.

(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement