యూట్యూబర్‌గా అందరికీ తెలిసిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో గతేడాది హీరోగా హిట్ కొట్టాడు. అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. మౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఇతడు తర్వాత ఎవరితో ఎలాంటి చిత్రం చేస్తాడా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై కాస్త క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)
టాలీవుడ్‌లో ప్రస్తుతం బడా హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్.. మౌళి రెండో మూవీని నిర్మిస్తోందట. శ్రీను అనే కొత్త దర్శకుడు.. ఈ చిత్రాన్ని తీయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు రిజిస్టర్ కూడా చేయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా జమానాలో ట్రెండీ జనరేషన్‌కి ఈ టైటిల్‌తో పెద్ద సమస్య లేకపోవచ్చేమో గానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ టైటిల్‌కి ఆదరణ దక్కుతుందా అంటే సందేహమే. ఈ టైటిల్‌పైనా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మరి అంతా అనుకుంటున్నట్లు ఇదే టైటిల్ పెడతారా? లేదంటే ఏమైనా మారుస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)


