టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్‌ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్‌లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.
రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడీ సిరీస్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)
ab rap aur badla bolega…out loud 🎤🔥#LukkheOnPrime, New Series, May 8 #King #RaashiKhanna #LakshvirSaran #PalakTiwarii #ShivankitParihar #NakulSahdev #KritikaBhardwaj @himankgaur #OptimystixEntertainment #WhiteGuerrilaLLP #VipulDShah @bahlrajesh #AgrimJoshi… pic.twitter.com/hEnvfRqdPN
— prime video IN (@PrimeVideoIN) April 14, 2026


